Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

నవంబరు 19న మలేసియా ఎన్నికలు

పుత్రజయ : రాజకీయ సుస్థిరత పునరుద్ధరణకు మలేసియా ప్రధానమంత్రి ఇస్మాయిల్‌ సాబ్రి యాకోబ్‌ ఆకస్మిక ఎన్నికలకు ప్రకటించిన తరువాత మలేసియా జాతీయ ఎన్నికలు నవంబరు 19న జరుగుతాయని అధికారులు గురువారం ప్రకటించారు.
ఈ నెలారంభంలో ప్రధానమంత్రి యాకోబ్‌ పార్లమెంటును రద్దు చేశారు. 222మంది సభ్యులున్న పార్లమెంటులో తన మెజారిటీ పెంచటానికి నిర్ణీత సమయానికి ఏడాది ముందుగానే ఎన్నికలకు పిలుపిచ్చారు. ‘‘నవంబరు 19 ఎన్నికల తేదీ’’ అని ఎన్నికల సంఘం ఛైర్మన్‌ అబ్దుల్‌ ఘనీ సల్లేప్‌ా పత్రికా విలేకరుల సమావేశంలో చెప్పారు. నంబరు 5 నామినేషన్ల తేదీ అన్నారు. 97 సంవత్సరాల మాజీ ప్రధానమంత్రి మహతీర్‌ మొహమ్మద్‌ ఎన్నికల్లో పోటీ చేస్తారని భావిస్తున్న వారిలో ఉన్నారు.పాలక బారిసాన్‌ నేషియోనల్‌ సంకీర్ణంలో ఆధిపత్య పార్టీగా ఉన్న యాకోబ్‌ యుఎంఎన్‌ఓ, ప్రతిపక్ష నాయకుడు అన్వర్‌ ఇబ్రహీం నేతృత్వంలోని బద్ధ ప్రత్యర్ధి కతాన్‌ హరపాన్‌ కూటమితో ముఖాముఖీ తలపడనుంది. మహతీర్‌ నేతృత్వంలోని పెజుఆంగ్‌తో సహా అనేక పార్టీలు ఎన్నికల బరిలో ఉండనున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img