Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

నాటో రద్దు కోరుతూ భారీ నిరసన ర్యాలీ

మాడ్రిడ్‌ : మాడ్రిడ్‌లోని ఆర్మీ వార్‌ కాలేజీలో నాటో సదస్సుకు వ్యతిరేకంగా వేలాదిమంది నినదించారు. యుగోస్లేవియా నుంచి లిబియా వరకు యుద్ధాలకు కారణమైన నాటోను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రపంచంలో శాంతి, సుస్తిరతను నెలకొల్పాలని కోరారు. బుధ, గురువారాల్లో స్పెయిన్‌ రాజధాని మాడ్రిడ్‌లో జరుగనున్న ఉత్తర అట్లాంటిక్‌ అలయన్స్‌ శిఖరాగ్ర సమావేశాన్ని తిరస్కరిస్తూ వేలాదిమంది మాడ్రిడ్‌ వీధుల్లోకి వచ్చారు. రీనా సోఫియా మ్యూజియం వద్ద పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన జరిగింది. దాదాపు 30,000 మంది ప్రజలు నిరసనలో పాల్గొన్నారు. ‘‘నో టు నాటో, నాట్‌ టు వార్‌, శాంతి కోసం’’ వంటి నినాదాలతో బ్యానర్లు మరియు పోస్టర్లు పట్టుకుని నిరసన తెలిపారు. స్పెయిన్‌లోని అమెరికా సైనిక స్థావరాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.కమ్యూనిస్ట్‌ యూత్‌, కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ స్పెయిన్‌ యువజన విభాగం, శాంతి వేదిక, వరల్డ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ యూత్‌ వంటి ఆర్గనైజేషన్స్‌ ఈ నిరసనను చేపట్టాయి. యాంటీ మిలిటరిస్ట్‌, ఎకాలజిస్ట్‌, ఫెమినిస్ట్‌, ట్రేడ్‌ యూనియన్స్‌,వాతావరణ పరిరక్షకులు, సంయుక్తంగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నేషనల్‌ పోలీస్‌ ఏజెంట్లు ప్రెస్‌ను బెహిష్కరించారు. పాఠశాల దుస్తులు ధరించి, గ్రాఫిటీలు, బ్యానర్లు, పాటల ద్వారా వారు 24వ తేదీ శుక్రవారం మెలిల్లా సరిహద్దులో జరిగిన హత్యలను ఖండిస్తూ స్కూల్‌ ఆఫ్‌ వార్‌ను శాంతి పాఠశాలగా మార్చాలని డిమాండ్‌ చేశారు. యూత్‌ ఫర్‌ క్లైమేట్‌ ప్రతినిధులు శాంతి కోసం పిలుపునిచ్చారు. నిరసనకారులలో ఒకరైన కొంచా హోయోస్‌ ఇలా అన్నారు, ‘‘నేను ఈ ఆయుధాల వ్యాపారం ద్వారా ప్రజలను చంపడాన్ని విసిగిపోయాను. వారు ప్రతిపాదించే పరిష్కారర ఆయుధాలు, యుద్ధాలే.. నాటో వద్దు, ఆర్మీ స్థావరాలు వద్దు, అమెరికన్లు మమ్నల్ని యుద్ధాలు, ఆయుధాలు లేకుండా ఒంటరిగా వదిలేయండి అని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img