Friday, April 19, 2024
Friday, April 19, 2024

నాయకత్వ అంతరానికి చెక్‌ : గుటెర్రస్‌

2.7డిగ్రీల సెల్సియస్‌ పెరిగిన ప్రపంచ ఉష్ణోగ్రతలు

ఐక్యరాజ్యసమితి : స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో జరిగే ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పు సదస్సుకు ముందు వాతావరణ చర్యల్లో ‘నాయకత్వ అంతరానికి’ ముగింపు పలకలవసిన అవసరాన్ని ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రస్‌ మంగళవారం నొక్కి చెప్పారు. వాతావరణ కాలుష్యం తగ్గించే కార్యాచరణకోసం ‘నాయకత్వ అంతరం’ ముగించాలన్నారు. ఇది గ్లాస్గోలో జరిగే కాప్‌ 26వ సదస్సుకు ముందే జరగాలని పేర్కొన్నారు. కాలుష్య నియంత్రణకు నాయకత్వం ఇందుకుసిదధం కావాలన్నారు. ‘ది హీట్‌ ఈజ్‌ ఆన్‌’ పేరుతో ఐరాస వాతావరణ సదస్సులో ఉద్గారాల అంతరం నివేదిక 2021 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ఈ విజ్ఞప్తి చేశారు. ఆయా దేశాలు వాగ్దానం చేసిన లక్ష్యాలను పరిపూర్తిచేయనందున పారిశ్రామికీకరణకు ముందున్న ఉష్ణోగ్రతలను మించి 2.7 డిగ్రీల సెల్సియస్‌కు పెరిగిందని తెలిపారు. అయితే ఉద్గారాల అంతరాలకు ప్రధాన కారణం నాయకుల బూటకపు వాగ్దానాలే. 2030 నాటికి ప్రపంచ కర్బన ఉద్గారాలను 2010 స్థాయి నుంచి 45శాతం తగ్గించకపోతే పారిస్‌ ఒప్పందం లక్ష్యం సాధించలేమని అన్నారు. నాయకులు తమ చర్యల్లో కూడా స్పష్టంగా ఉండాలని సూచించారు. సున్నా ఉద్గారాలను చేరుకోవడానికి సాహసోపేతమైన నిర్దిష్టగడవు తక్షణం అమలుచేసే ప్రణాళికతో గ్లాస్గోకు రావలసిన అవసరం ఉందని గుటెర్రస్‌ పేర్కొన్నారు. గత కొన్ని రోజులగా ప్రకటనలు కార్యరూపం దాల్చినప్పటికీ, ప్రపంచ ఉష్ణోగ్రతల్లోపెరుగుదల 2డిగ్రీల సెల్సియస్‌ కంటే ఎక్కువగానే ఉందని ఆయన హెచ్చరించారు. 2030 నాటికి ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5సెల్సియస్‌కు మించకుండా చర్యలు తీసుకోవడంపై మానవాళి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. పారిస్‌ ఒప్పంద లక్ష్యాలను చేరుకోవడంతో ప్రపంచ దేశాలు పూర్తిగా విఫలమవుతున్నాయని గుటెర్రస్‌ ఆందోళన వెలిబుచ్చారు. ఉష్ణోగ్రతల తగ్గింపుకు పెట్టుబడులలో 20శాతం మాత్రమే హరిత ఆర్థికవ్యవస్థకు మద్దతు ఇస్తాయని నివేదిక అంచనావేసిందని పేర్కొన్నారు. రవాణా, వ్యవసాయం, అటవీరంగం నుంచి ప్రతి రంగాన్ని డీ కార్బనైజ్‌ చేయమని గుటెర్రస్‌ ప్రపంచ దేశాలను కోరారు. జి20 దేశాలు కర్బన ఉద్గారాల్లో 80శాతం ప్రాతినిధ్యం వహిస్తున్నందును ఆయా దేశాలపాత్ర కీలకమని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img