Friday, April 19, 2024
Friday, April 19, 2024

నిరసనలతో దద్దరిల్లిన స్వీడన్‌

స్టాక్‌హోమ్‌: స్వీడన్‌ నగరాలు నిరసనలతో దద్దరిల్లాయి. అంతర్జాతీయ సైనిక విన్యాసానికి ఆతిథ్యం ఇవ్వడం, నార్త్‌ అట్లాంటిక్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌ (నాటో)లో సభ్యత్వానికి వెంపర్లాడుతున్న ప్రభుత్వ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా 17 నగరాల్లో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. నాటో అమెరికా యుద్ధ తంత్రం అంటూ ప్రజలు నినదించారు. తమ దేశం సైనిక కూటమిలో చేరడాన్ని తీవ్రంగా నిరసించారు. నాటో రక్షణాత్మక కూటమి కాదు. ఇది అమెరికా తప్పిదాలను సమర్థించే సంస్థ’’ అంటూ ప్రజలు ప్లకార్డులుచేపట్టి, పెద్దపెద్ద బానర్లతో కదం తొక్కారు. స్వీడిష్‌ పీస్‌ అండ్‌ ఆర్బిట్రేషన్‌ సొసైటీ, నో నాటో, నో టు న్యూక్లియర్‌ వెపన్స్‌ అంటూ రాజకీయ పార్టీలు వంటి అనేక సంస్థలు, నెట్‌వర్క్‌లు ఈ ప్రపదర్శనచేపట్టాయి. ఒక్క స్టాక్‌హోమ్‌లోనే వందలాది మంది నిరసనలో పాల్గొన్నారు. ‘‘నాటో వద్దు’’, ‘‘నాటో యుద్ధం ఒక డాలర్‌ కోసం మా పిల్లలను చంపేస్తుంది’’ ‘‘స్టాప్‌ అరోరా 23’’ వంటి సందేశాలతో కూడిన ప్లకార్డులు, బ్యానర్‌లతో సుమారు 26,000 మంది ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. కమ్యూనిస్ట్‌ పార్టీ సభ్యుడు క్రిస్టర్‌ హోల్మ్‌, స్వీడన్‌ తటస్థంగా ఉంటే మంచిదని చైనా వార్తాపత్రిక జిన్హువాతో అన్నారు. ‘‘మనం తటస్థంగా ఉంటే స్వీడిష్‌ సమాజం, ప్రజాస్వామ్యం, సంస్కృతి అభివృద్ధికి మంచిది. నాటో ఒక యుద్ధ కూటమి అని హోల్మ్‌ అన్నారు. ‘‘నాటో సభ్యుడిగా ఉంటే స్వీడిష్‌ పన్ను చెల్లింపుదారులకు కూడా చాలా ఖర్చు అవుతుంది, ఎందుకంటే విద్యా వ్యవస్థ, ఆరోగ్య సంరక్షణకు నిధులు తగ్గించేటప్పుడు రక్షణ బడ్జెట్‌ రెట్టింపు అవుతుంది’’ అని హోల్మ్‌ చెప్పారు. స్వీడన్‌ నాటో సభ్యదేశంగా మారితే అణ్వాయుధాలు స్వీడన్‌ భూభాగంలో నిల్వ చేస్తారనే భయాలను వ్యక్తం చేశారు. ‘‘స్వీడన్‌ సాంప్రదాయకంగా అణు నిరాయుధీకరణ కోసం పని చేస్తుంది,’’ అని హోల్మ్‌ చెప్పారు, స్వీడన్‌ నాటో సభ్యునిగా మారితే‘‘రాజకీయ నాయకులు తమ స్థానాన్ని పునఃపరిశీలించవలసి ఉంటుంది.’’ మెజారిటీ స్వీడన్లు నాటోలో చేరేందుకు ప్రతికూలత వ్యక్తంచేశారు. చాలా మంది స్వీడన్లు తమ దేశం సైనిక కూటమిలో సభ్యుడిగా ఉండటం వల్ల కలిగే ప్రతికూల పరిణామాలపై ఆందోళన చెందుతున్నారు. మార్చి, 22న, స్వీడిష్‌ పార్లమెంట్‌, రిక్స్‌డాగెన్‌, నాటోలో చేరడానికి అనుకూలంగా ఓటు వేసింది. స్వీడన్‌ నాటోలో సభ్యుడిగా మారే అవకాశం ఉన్నప్పటికీ, స్వీడన్‌ సభ్యత్వానికి వ్యతిరేకంగా ప్రచారం ఆగదని హోల్మ్‌ చెప్పారు.‘‘మేము దానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటాం. స్వీడన్‌ నాటో సభ్య దేశంగా మారితే, మేము వేర్పాటు కోసం ప్రయత్నిస్తాము’’ అని హోల్మ్‌ చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img