Friday, April 19, 2024
Friday, April 19, 2024

నీట మునిగిన థాయ్‌ యుద్ధ నౌక

బ్యాంకాక్‌: గల్ఫ్‌ ఆఫ్‌ థాయ్‌లాండ్‌లో విధులు నిర్వ హిస్తున్న ఓ థాయ్‌ యుద్ధ నౌక ప్రమాదవశాత్తూ నీట మునిగింది. ఈ ఘటనలో 75 మందిని కాపాడగా మరో 31 మంది గల్లం తయ్యారు. వారి కోసం నౌకలు, హెలికాప్టర్లతో సహాయక చర్యలు కొనసాగుతు న్నాయి. థాయ్‌లాండ్‌లోని ప్రచుప్‌ ఖిరి ఖాన్‌ ప్రావిన్లో సముద్ర తీరానికి 20 నాటికల్‌ మైళ్ల దూరంలో హెచ్‌టీఎంస్‌ సుఖొథాయ్‌ ఆదివారం రాత్రి సాయంత్రం గస్తీ విధుల్లో పాల్గొంది. ఆ సమయంలో బలమైన ఈదురుగాలుల కారణంగా సముద్రపు నీరు యుద్ధనౌకలోకి చేరి విద్యుత్తు వ్యవస్థ దెబ్బతింది. సమాచారమం దుకున్న థాయ్‌ నౌకాదళం… ఆ యుద్ధనౌక వద్దకు మూడు ఫ్రిగెట్లు, రెండు హెలికాప్టర్లను పంపింది. వారు అక్కడకు చేరుకుని మొబైల్‌ పంపింగ్‌ మిషన్లనుంచి నీటిని బయటకు పంపించేం దుకు ప్రయత్నించారు. కానీ, బలమైన గాలుల కారణంగా అది సాధ్యప డలేదు. ఇంజిన్‌ వ్యవస్థ పనిచేయకపోవడం, కరెంట్‌ లేకపోవడంతో మరింత నీరు నౌకలోకి చేరింది. దీంతో నెమ్మదిగా నౌక ఓవైపు ఒరుగుతూ నీటమునిగింది. ప్రమాద సమయంలో నౌకలో 106 మంది నేవీ సిబ్బంది ఉన్నారు. వీరిలో 75 మంది నావికులను సహాయక బృందం కాపాడగా, మరో 31 మంది కోసంఅర్ధరాత్రి నుంచి గాలింపు చర్యలు కొనసాగు తున్నాయి. నౌకలు, హెలికాప్టర్ల సాయంతో నావికుల కోసం గాలిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను థాయ్‌ నేవీ ట్విటర్లో పోస్ట్‌ చేసింది. కాగా ఈ ఘటనలో ఎవరూ మరణిం చినట్లు వార్తలందలేదు. ముగ్గురు సిబ్బంది పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img