Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

నేడు జాంబియా అధ్యక్ష ఎన్నికలు

లుసాకా : దక్షిణాఫ్రికా ఖండ దేశమైన జాంబియా గురువారం ఎన్నికలకు సిద్ధమైంది. ప్రస్తుత అధ్యక్షడు ఎడ్గార్‌ లుంగును తిరిగి ఎన్నుకోవాలా..వద్దా..అనే దానిపై ప్రజలు తీవ్ర గందరగోళంలోఉన్నారు. దేశ అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యులను, మేయర్లను, కౌన్సిలర్లను ఎన్నుకునేందుకు రంగం సిద్ధం చేసింది. కోవిడ్‌ నియంత్రణల మధ్య జరుగనున్న ఈ ఎన్నికల్లో నెలకొన్న ఆంక్షలు కారణంగా ఎన్నికల్లో భౌతిక ప్రచారాలపై తీవ్ర నిషేధం ఉంది. ఈ ఎన్నికల్లో అధికారపార్టీకి చెందిన పేట్రియాటిక్‌ ఫ్రంట్‌ (పీఎఫ్‌) నాయకుడు ఎడ్గార్‌ లుంగు, ప్రతిపక్ష నాయకుడు యునైటెడ్‌ పార్టీ ఫర్‌ నేషనల్‌ డెవలప్‌మెంట్‌ (యూపీఎన్‌డీ) 59ఏళ్ల లుంగు హిచిలేమా మధ్యలో తీవ్ర పోటీ నెలకొంది. పీఎఫ్‌ పార్టీ అధికార ప్రతినిధి ఆంటోనియో మ్వాన్జా మాట్లాడుతూ.. ఈ ఎన్నికల ప్రక్రియను నిర్వీర్యం చేసేందుకు ప్రతిపక్షాలు హింసాత్మక సంఘటనలకు పూనుకుంటున్నారని, ప్రజలను భయపెడుతున్నారని వ్యాఖ్యానించారు. జాంబియాలో 17 మిలియన్ల మంది ప్రజలు అత్యంత పేదరికంలో ఉన్నారు. జీవనవ్యయాలు పెరిగాయి. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఆర్థికంగా నిలదొక్కుకోలేక పోతున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img