Friday, April 19, 2024
Friday, April 19, 2024

న్యూజిలాండ్‌ కొత్త ప్రధానిగా క్రిస్‌ హిప్‌కిన్స్‌?

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌ కొత్త ప్రధానమంత్రిగా క్రిస్‌ హిప్‌కిన్స్‌ ఎన్నిక దాదాపు ఖరారైంది. ప్రస్తుత ప్రధాని జెసిండా ఆర్డెన్స్‌ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో అధికార లేబర్‌ పార్టీ నాయకుడిని ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభమైంది. పార్టీకి చెందిన ఎంపీ, మాజీ మంత్రి హిప్‌కిన్స్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. ఈనెల 22న జరుగనున్న సమావేశంలో పార్టీ ఎంపీలు ఆయన నామినేషన్‌కు మద్దతు తెలపాల్సి ఉంంది. ఒకే నామినేషన్‌ రావడంతో తదుపరి ప్రధానిగా హిప్‌కిన్స్‌ (44) ఎన్నిక ఖరారైనట్లు లేబర్‌ పార్టీ ప్రకటించింది. దీంతో దేశ 41వ ప్రధానిగా హిప్‌కిన్స్‌ త్వరలోనే బాధ్యతలు స్వీకరిస్తారని తెలుస్తోంది. అక్టోబర్‌ 14న సార్వత్రిక ఎన్నికలు ఆయన సారధ్యంలో జరుగుతాయి. కోవిడ్‌ వేళ హిప్‌కిన్స్‌ కోవిడ్‌ రెస్పాన్స్‌ మినిస్టర్‌గా సమర్థవంతంగా వ్యవహరించారు. ఆయన నాయకత్వంలో మహమ్మారిని న్యూజిలాండ్‌ కట్టడి చేయగలిగింది. హిప్‌కిన్స్‌ తొలుత 2008లో పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 2020 నవంబరులో కోవిడ్‌ కట్టడికిగాను మంత్రిగా నియమితులయ్యారు. జసిండా అర్డెన్‌ తన రాజీనామాను అధికారికంగా గవర్నర్‌ జనరల్‌కు అందజేసిన తర్వాత కింగ్‌ చార్లెస్‌ 3 తరపున హిప్‌కిన్స్‌ను ఆయన ప్రధానిగా నియమిస్తారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img