Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

పంజ్‌షీర్‌ తాలిబన్ల వశం

ప్రతిఘటన దళాల ఓటమి
పారిపోయిన అమ్రుల్లా సలేప్‌ా

పంజ్‌షీర్‌ : హోరా హోరీగా సాగుతున్న యుద్ధంలో పంజ్‌షీర్‌ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తాలిబన్లుప్రకటించారు. అఫ్గాన్‌ రాజధాని కాబూల్‌కు 150కి.మీ దూరంలో హిందుకుష్‌ పర్వత సానువుల్లో ఉన్న పంజ్‌షీర్‌ తాలిబన్ల వశమైంది.ఈ విషయాన్ని తాలిబన్‌ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్‌ తెలిపారు. అఫ్గాన్‌ మీడియా చెబుతున్న ప్రకారం పంజ్‌షీర్‌ తిరుగుబాటు నాయకుడు అమ్రుల్లా సలేప్‌ా తజికిస్తాన్‌కు పారిపోయారు. దేశ మాజీ ఉపాధ్యక్షుడు సలేప్‌ా పంజ్‌షీర్‌లో ఉంటున్న ఇంటిపై దాడి జరి గింది. తాలిబన్లకు తలవంచడం తనకు ఇష్టంలేదని సలేప్‌ా బ్రిటిష్‌ వార్తాపత్రికలోని తన వ్యాసంలో పేర్కొన్నారు. తాలిబన్లకు సహాయం చేసేందుకు ఆదివారం డ్రోన్‌ స్థావరాల నుండి దళాలు జరిపిన వైమానిక దాడుల అనంతరం సలేప్‌ా పారిపోయారు. అఫ్గాన్‌ను స్వాధీనం చేసుకునేందుకు పాక్‌ తాలిబన్లకు మద్దతు ఇస్తోందన్న విషయం తెలిసిందే. తాలిబన్ల కోసం పనిచేసే హక్కానీ నెట్‌వర్క్‌తో ఐఎస్‌ఐకి సంబంధాలు ఉన్నాయి. పాక్‌ సరిహద్దు ప్రాంతాల్లో క్వెట్టా నగరంలో తాలిబన్‌ యోధులకు, కుటుంబాలకు ఆశ్రయం కల్పిస్తోంది. అఫ్గ్గాన్‌ జాతీయ ప్రతిఘటన దళాల ప్రతినిధి, అఫ్గ్గాన్‌ జర్నలిస్టుల సమాఖ్య సభ్యుడు ఫహిమ్‌ను తాలిబన్లు మట్టుపెట్టారు. పాక్‌ దళాలు జరిపిన డ్రోన్‌ బాంబు దాడుల్లో ఆయన మరణించి నట్లు అంచనా. పాక్‌ సహకారంతో తాలిబన్లు పంజ్‌షీర్‌ను కైవసం చేసుకుందని అంతర్జాతీయ మీడియా జర్నలిస్టులు సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు. తాలిబన్ల ఆక్రమణ నేపథ్యంలో పంజ్‌షీర్‌లో మారణహోమం జరిగే అవకాశం ఉందన్న హెచ్చరికలు వెల్లడవుతున్నాయి.
ఎవరైనా తోక జాడిస్తే పంజ్‌షీర్‌కు పట్టిన గతే..
ఎవరైనా సమస్యలు సృష్టించాలని చూస్తే పంజ్‌ షీర్‌కు పట్టినగతే పడుతుందని తాలిబన్లు హెచ్చరిం చారు. కాబూల్‌లో నిర్వహించిన తాజా మీడియా సమావేశంలో తాలిబన్‌ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్‌ మాట్లాడుతూ.. యుద్ధం ముగిసిందని, ఇక ఆఫ్గానిస్థాన్‌ సుస్థిరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఎవరైనా ఆయుధాల వైపు చూసినా, వాటిని తాకినా వారు ఈ దేశానికి, ప్రజలకు శత్రువులుగా మారతా రని హెచ్చరించారు. ‘చొరబాటుదారులు’ దేశ పునర్ని ర్మాణం చేయలేరని ప్రజలు గుర్తించాలని ఇది ప్రజల బాధ్యత అని జబీహుల్లా పేర్కొన్నారు. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు తాలిబన్లు ప్రయత్నించారని పేర్కొన్న ఆయన.. ఎవరైనా సమస్యలు సృష్టించాలని చూస్తే పంజ్‌షీర్‌లో ఏం జరిగిందో చూశారుగా అని జబీహుల్లా హెచ్చరించారు.
గర్భిణీ అధికారిణి కాల్చివేత
అఫ్గాన్‌లో తాలిబన్ల అరాచకాలకు అంతులేకుండా పోయింది. తాజాగా 6నెలల గర్భిణీగా ఉ్నన మహిళా పోలీసును దారుణంగా హత్య చేశారు. ఆమె కుటుంబసభ్యుల ఎదుటే ఆమెను కిరాతకంగా తుపాకీతో కాల్చి చంపారు. ఘోర్‌ ప్రావిన్స్‌లోని ఫిరోజ్‌కోప్‌ా పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అఫ్గాన్‌ ప్రభుత్వంలో జైలు అధికారిణిగా బాను నెగర్‌ పనిచేశారు. ఇప్పటికే అఫ్గన్‌ మహిళలు తమ భద్రతపై ఆందోళన చెందుతుండగా తాజాగా ఈ హత్య కలకలం రేపింది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులును తాలిబన్లు లక్ష్యంగా చేసుకుంటున్నారు.
పరదాల మధ్య చదువు
అఫ్గాన్‌లో విద్యార్థినీ, విద్యార్థులకు మధ్య పరదాలను ఏర్పాటు చేసి, విద్యా సంస్థల యాజమాన్యాలు చదువులు చెబుతున్నాయి. యూనివర్శిటీల్లోని విద్యార్థినీ, విద్యార్థులకు తరగతులు వేర్వేరుగా నిర్వహించాలని, అలా కుదరని పక్షంలో విద్యార్థినీ, విద్యార్థులకు మధ్య పరదాలను ఏర్పాటు చేయాలని తాలిబాన్లు హుకూం జారీ చేశారు. అంతేకాకుండా వీరిద్దరూ వెళ్లే మార్గాలు కూడా వేర్వేరుగా ఉండాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఆయా కళాశాలల యాజమాన్యాలు పరదాల మధ్యలో తరగతులను నిర్వహిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img