Friday, April 19, 2024
Friday, April 19, 2024

పర్యావరణానికి హాని చేయొద్దు


రోమ్‌ నుంచి గ్లాస్గోకు చేరిన నిరసనలు

గ్లాస్గో : అభివృద్ధికోసం పర్యావరణానికి తూట్లు పొడిచే నిర్ణయాలు తీసు కుంటున్న జి20 దేశాధినేతల తీరును పర్యావరణ కార్యకర్తలు, కార్మికులు, విద్యార్థులు నిరసించారు. జి20 దేశాధినేతల సమావేశం రెండోరోజు నిరసనకారులు ఆందోళన చేపట్టారు. రోమ్‌ నుంచి ప్రారంభమైన నిరసన జ్వాల కాప్‌`26 సమావేశం జరుగుతున్న గ్లోస్గోలో కూడా తలెత్తింది. మీరు జి20 మేం భవిష్యత్తు అంటూ నిరసించారు. ఈ ర్యాలీలో దాదాపు ఐదువేల మంది పాల్గొన్నారు. జి20కి ప్రత్యామ్నాయంగా మేమే అంటూ ప్లకార్డులు చేపట్టి ఉద్యమిం చారు. ‘కాపిటలిజమ్‌ ఈజ్‌ డెత్‌’ అంటూ అస్థిపరంజరం వేషం వేసిన స్పెయిన్‌ వ్యక్తి తన ఆందోళనను తెలియజేశాడు. నాయకుల నుంచి ఫలితాలులేని నిర్ణయాలుగా నిరసనకారులు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img