Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

పలస్తీనా సహజ వనరులపై హక్కులు వారివే : ఐరాస

రమల్లా : పలస్తీనా సహజ వనరులపై ప్రజల సార్వభౌమత్వాన్ని పునరుద్ఘాటించే ఐక్యరాజ్య సమితి తీర్మానాన్ని పలస్తీనా విదేశాంగ మంత్రి రియాద్‌ అల్‌ మల్కీ స్వాగతించారు. పలస్తీనాపై ఇజ్రాయిల్‌ దురాక్రమణను నిలువరించాలని పిలుపునిచ్చారు. ఐరాస తీర్మానానికి అనుకూలంగా 157 ఓట్లు పోలవగా, వ్యతిరేకంగా కెనడా, అమెరికా, ఇజ్రాయిల్‌, నౌరు, మైక్రోనేషియా దేశాల మద్దతు లభించింది. ఈ తీర్మానం ఆధారంగా పలస్తీనా ప్రజల హక్కులు, భూమి, నీరు, శక్తి వంటి వనరులతోపాటు వారి సహజ సంపద, సార్వభౌమాధికారాన్ని పునరుద్ఘాటిస్తుందని మల్కీ నొక్కి చెప్పారు. తూర్పు జెరూసలేంతో సహా ఆక్రమిత భూభాగాల్లో దోపిడీ, సహజ వనరులకు నష్టం కలిగించడాన్ని నిలిపివేయాలని ఇజ్రాయిల్‌ ప్రభుత్వానికి ఆయన పిలుపునిచ్చారు. వెస్ట్‌ బ్యాంక్‌, గాజా స్ట్రిప్‌లో పర్యావరణాన్ని దెబ్బతీసే స్థిరనివాసుల చర్యలతో సహా అన్ని చర్యలను నిలిపివేయాలని కోరింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img