Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

పాక్‌లో ముదిరిన విద్యుత్‌ సంక్షోభం

మొబైల్‌, ఇంటర్‌నెట్‌ సేవల నిలిపివేత

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌లో విద్యుత్‌ సంక్షోభం తీవ్రమైంది. దీంతో మొబైల్‌, ఇంటర్‌నెట్‌ సేవలను నిలిపివేస్తామని పాక్‌ జాతీయ సమాచార సాంకేతిక సంస్థ (ఎన్‌ఐటీబీ) హెచ్చరించింది. దేశవ్యాప్తంగా గంటల తరబడి విద్యుత్‌ కోతలు వెంటాడుతుండటంతో టెలికాం ఆపరేటర్ల సేవలపై ప్రభావం పడుతోందని, దీంతో మొబైల్‌, ఇంటర్‌నెట్‌ సేవలను మూసివేస్తామని టెలికాం ఆపరేటర్లు చెబుతున్నారని ఎన్‌ఐటీబీ ట్విట్టర్‌లో పేర్కొంది. జులైలో విద్యుత్‌ సరఫరాలో తీవ్ర అంతరాయం నెలకొంటుందని పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ దేశ ప్రజలను ఇప్పటికే హెచ్చరించారు. దేశ అవసరాలకు సరిపడా ఎల్‌ఎన్‌జీ సరఫరాలు ఉండటం లేదని, ఈ పరిస్ధితిని చక్కదిద్దేందుకు సంకీర్ణ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. గ్యాస్‌ సరఫరాలకు సంబంధించిన ఒప్పందం అంగీకరించడంలో ప్రభుత్వం విఫలమవడంతో పాకిస్తాన్‌ను విద్యుత్‌ సంక్షోభం వెంటాడుతోంది. మరోవైపు విద్యుత్‌ వినిమయాన్ని తగ్గించేందుకు ప్రభుత్వ ఉద్యోగుల పనివేళలను తగ్గంచడంతో పాటు కరాచీ సహావివిధ నగరాల్లో ఫ్యాక్టరీలు, షాపింగ్‌ మాల్స్‌ను త్వరగా మూసివేయాలని పాక్‌ ప్రభుత్వం ఆదేశించింది. ఇక మూడేళ్ల్ల నుంచి పదేళ్ల వరకూ ఎల్‌ఎన్‌జీ సరఫరాల కోసం ఖతార్‌తో ఒప్పందం చేసుకునేందుకు పాకిస్తాన్‌ ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోందని ఆర్ధిక మంత్రి మిఫ్తా ఇస్మాయిల్‌ తెలిపారు. పాక్‌లో కాగితం కొరత తీవ్రతరం కావడంతో ఆగస్టులో ప్రారంభంకానున్న విద్యా సంవత్సరానికి పుస్తకాలు అందుబాటులో ఉండవని పేపర్‌ అసోసియేషన్‌ వెల్లడిరచింది. దిగుమతి చేసుకుంటున్న కాగితంపె భారీగా పన్నులు విధించడం, స్థానిక కాగితపు పరిశ్రమల గుత్తాధిపత్యం ఈ పరిస్థితికి దారితీసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img