Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పుతిన్‌పై హత్యాయత్నం

మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌పై హత్యాయత్నం జరిగినట్లు తెలుస్తోంది.ఆయన ప్రయాణిస్తున్న కారుపై బాంబుదాడి జరిగినట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బైటపడినట్లు జీవీఆర్‌ టెలిగ్రామ్‌ ఛానల్‌ వెల్లడిరచింది. పుతిన్‌ ప్రయాణించే లిమోసిన్‌ వాహనాన్ని ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఆ వాహనానికి చెందిన ఎడమవైపు చక్రం ధ్వంసమైంది. ఢీకొట్టిన సమయంలో భారీ శబ్ధం కూడా వచ్చినట్లు టెలిగ్రామ్‌ ఛానల్‌ రిపోర్ట్‌లో తెలిపారు.
లిమోసిన్‌ కారును ఢీకొన్న సమయంలో భారీగా పొగలు కూడా వచ్చాయని, కానీ సురక్షితంగా ఆ కారును చేర్చినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఎటువంటి గాయం కాలేదు. కానీ ఈ ఘటనలో అనేక మందిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. పుతిన్‌ ప్రయాణించే వాహనాన్ని ఢీకొట్టినట్లు మరో సైట్‌లోనూ న్యూస్‌ రాశారు. ఉక్రెయిన్‌పై దాడి వల్ల రష్యా మిలిటరీకి భారీగా నష్టం వచ్చింది. దీంతో రష్యాకు చెందిన కొందరు రాజకీయవేత్తలు పుతిన్‌ రాజీనామా డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలోనే పుతిన్‌పై హత్యాయత్నం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. యూరో వీక్లీ న్యూస్‌ ఇచ్చిన రిపోర్ట్‌ ప్రకారం ఈ విషయం వెల్లడైంది. జనరల్‌ జీవీఆర్‌ టెలిగ్రామ్‌ ఛానల్‌లో దీన్ని రిలీజ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img