Friday, April 19, 2024
Friday, April 19, 2024

పూర్వీకుల భూములు మావే

ఆరువేల మంది నిరసన

బ్రసీలియా : తమ పూర్వీకుల భూములపై రిజర్వేషన్లు తొలగించాలని నినదిస్తూ బ్రెజిల్‌ రాజధాని బ్రసీలియాలో ఆరువేల మంది సుప్రీం కోర్టు ఎదుట నిరసన చేపట్టారు. స్వదేశీ భూములు విషయంలో న్యాయం జరగాలని కోరుతూ లాటిన్‌ అమెరికా దేశమైన బ్రెజిల్‌ సుప్రీంకోర్టు వెలుపల ఈ ప్రదర్శన చేపట్టారు. తమ పూర్వీకుల భూములపై తమకు హక్కు ఉందని డిమాండ్‌ చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై వత్తిడి తెచ్చారు. 173 జాతుల నుండి వచ్చిన ఆరువేల మంది ప్రదర్శనకారులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. తలపై ఈకలు ధరించి పెయింట్‌ చేసిన శరీరాలపై వీరు సాంప్రదాయ దుస్తులు ధరించారు. శాంటా కాటరినా రాష్ట్రానికి చెందని స్వదేశీ జాతి ప్రజలు తమ పూర్వీకుల భూములపై తమవేనన్నారు. కొన్ని స్థానిక భూములకు రక్ష్షిత హోదాను తొలగించాలని డిమాండ్‌ చేశారు. తమ భూములను ప్రభుత్వం ఆగ్రి బిజినెస్‌కు, మైనింగ్‌కు తెరదీయడంపై వీరు నిరసించారు. ఈ ప్రభుత్వం స్వదేశీ ప్రజలపై దాడి చేస్తోందని పటాక్సో ప్రజల చీఫ్‌ అన్నారు. ఈ రోజు మానవాళి అంతా అమెజాన్‌ రెయిన్‌ఫారెస్ట్‌ను కాపాడాలను పిలుపునిస్తోంది. తమ భూములను బ్రెజిల్‌ ప్రభుత్వం గోల్డ్‌ మైనింగ్‌లకు దారాదత్తం చేయడమేమిటని ప్రశ్నించారు. గత 20 ఏళ్లలో బ్రెజిల్‌ సైనిక నియంతృత్వ పాలనలో తమకు చెందిన భూమిని బలవంతంగా లాక్కోవడం అన్యాయమని స్వదేశీ జాతులు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img