Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పెట్టుబడీదారీ విధాన నిర్మూలనతోనే.. మహిళలకు విముక్తి

ప్రిటోరియా : పెట్టుబడీదారీ విధానాన్ని నిర్మూలించడం ద్వారా మాత్రమే మహిళలకు విముక్తి సాధ్యమని దక్షిణాఫ్రికా కమ్యూనిస్టుపార్టీ (ఎస్‌ఏసీపీ) పిలుపునిచ్చింది. సమాజంలో అన్ని రంగాల్లో మహిళల అణచివేతను అంతం చేయడాదనికి పెట్టుబడీదారీ దోపిడీ వ్యవస్థను అంతం చేయడం ద్వారా మాత్రమే సాధ్యమని పేర్కొంది. దక్షిణాఫ్రికా రాజధాని ప్రిటోరియాలో 1956లో జరిగిన మహిళా మార్చ్‌ దినోత్సవం సందర్భంగా పై వ్యాఖ్యలు చేసింది. అప్పటి మార్చ్‌లో 20,000 మంది మహిళలు పాల్గొన్నారని గుర్తుచేసింది. పురుషులతోపాటు మహిళలకు అన్ని రంగాల్లో సమానత్వం, ప్రజాస్వామ్యం, మానవ అభివృద్ధికోసం 100 సంవత్సరాల కమ్యూనిస్టు పార్టీ పోరాటాన్ని ఈ సందర్భంగా హైలెట్‌ చేసింది. పితృస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకిస్తూ లింగ అసమానతలను రూపుమాపాలని ఎస్‌ఏసీపీ పిలుపునిచ్చింది. సాంస్కృతిక, సామాజిక రంగాల్లో మహిళల అసంఘటిత పోరాటానికి ఎన్‌ఏసీపీ ప్రోత్సాహాన్నిచింది. కోవిడ్‌ దక్షిణాఫ్రికా మహిళలను తీవ్రస్థాయిలో కబళించింది. ఉపాధి రంగాల్లో పురుషుల కంటే మహిళలు తమ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని సామ్రాజ్యవాద శక్తులకు వ్యతిరేకంగా తమ స్వేచ్ఛ కోసం పోరాడుతున్న మహిళలకు ఎస్‌ఏసీపీ సంఫీుభావంగా ఉందని పేర్కొంది. పిల్లల సంరక్షణ, ఇంటిపనుల బాధ్యతను నిర్వహిస్తున్న మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించవలసిందిగా ప్రభుత్వాన్ని ఎస్‌ఏసీపీ డిమాండ్‌ చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img