Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

పెరూ అధ్యక్షుడిగా పెడ్రో కజిల్లో

లిమా : దక్షిణ అమెరికా దేశమైన పెరూ నూతన అధ్యక్షుడుగా వామపక్షవాది పెడ్రో కజిల్ల్లో(51) బుధవారం రాజధాని లిమాలో ప్రమాణ స్వీకారం చేశారు. వారాల తరబడి అనిశ్చితి అనంతరం జరిగిన ప్రమాణ స్వీకారం అనంతర మొదటి ప్రసంగంలో కజిల్లో మాట్లాడుతూ.. ‘‘మన దేశం ఒక రైతు చేత పాలించబడం ఇదే మొదటిసారి.. చాలామంది పెరూవియన్ల మాదిరిగా చాలా శతాబ్దాలుగా అణచివేతకు గురైన రంగాలకు చెందిన వ్యక్తిని’’ అని పేర్కొన్నారు. టీచర్స్‌ యూనియన్‌ మాజీ నాయకుడు కజిల్లో కొవిడ్‌`19 సంక్షోభాన్ని పరిష్కరించడంతో పాటు దేశాన్ని ఐక్యంచేసే వివిధ సవాళ్లను ఎదుర్కోనున్నారు. ఇదే రోజు పెరూ స్వాతంత్యదినోత్సవం కావడంతో కొత్త మంత్రులను ప్రకటించి పరిచయం చేశారు. నూతన రాజ్యాంగం రూపొందించే అంశంతోపాటు కాస్టిల్లో వివిధ ప్రతిపాదనలు చేయనున్నారు. దక్షిణ అమెరికా చరిత్రలో ఒక ఉపాధ్యాయుడు దేశ అధ్యక్షుడుగా ఎన్నిక కావడం ఇదే మొదటిసారి. నూతన రాజ్యాంగం రూపొందించే అంశంపై ప్రజలు ఆనందోత్సవాలు జరుపుకుంటున్నారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి అర్జెంటీనా,బొలీవియా, చిలీ, కొలంబియా, ఈక్వెడార్‌ అధ్యక్షులతోపాటు మరికొన్ని దేశాల మంత్రులు, విదేశీ రాయబారులు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img