Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

పైకి లేచేది మళ్లీ శిథిలమయ్యేందుకు కాదు..

టర్కీ కమ్యూనిస్టు పార్టీ
అంకారా: వరుస భూకంపాలతో టర్కీ అస్తవ్యస్థమైంది. శిథిలాల కింద గుట్టలుగా శవాలు ఉంటే ఇప్పటికే మృతుల సంఖ్య 47వేలను దాటింది. వేలాది మంది చిన్నారులు తీవ్రస్థాయిలో ప్రభావితమయ్యారు. ఈ క్రమంలో అంకారాలో టర్కీ కమ్యూనిస్టు పార్టీ భారీ సంఫీుభావ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. పైకి లేస్తున్నది మరోమారు శిథిలాల్లో చిక్కుకొని ఉక్కిరిబిక్కిరి అయ్యేందు కాదని ఉద్ఘాటించింది. ‘పైకి తేస్తున్నాం… మళ్లీ శిథిలమయ్యేందుకు కాదు’ అని నినాదమిచ్చింది. టర్కీ కమ్యూనిస్టు పార్టీ (టీకేపీ) ప్రధాన కార్యదర్శి కెమెల్‌ ఓక్యుయన్‌ ప్రారంభోపన్యాసం చేశారు. టర్కీ ప్రజలు కుటుంబాలు, ఇళ్లు, జ్ఞాపకాలు… సర్వం కోల్పోయారని దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొని ఉంటే ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు వీలు ఉండేదని, అలాగే బాధితులకు సమయానికి సాయం అందినా కొన్ని ప్రాణాలైనా కాపాడే అవకాశముండేదని అభిప్రాయపడ్డారు. అయితే ఇందుకోసం ప్రణాళికలు ముఖ్యమని నొక్కిచెప్పారు. ప్రణాళికలు లేనందునే ఇంతటి ప్రాణఆస్తి నష్టాన్ని చవిచూడాల్సి వచ్చిందన్నారు. హేతుబద్ధ ఆలోచనలకు, శాస్త్రీయతకు వ్యతిరేకలని టర్కీ ప్రభుత్వవర్గాలను దుయ్యబట్టారు. ఆర్థిక వ్యవస్థనే కాదు ప్రజల ప్రాణాలు కాపాడటానికి కూడా ప్రణాళికలు ఎంతో అవసరమన్నారు. సిరియాలోనూ తీవ్ర నష్టం వాటిల్లిందని ఆ దేశ ప్రజలకు సంఫీుభావాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి గ్రీస్‌ కమ్యూనిస్టు పార్టీ సంఫీుభావం తెలిపింది. టర్కీ, సిరియా భూకంప బాధితులకు గ్రీస్‌ కమ్యూనిస్టు యువత (కేఎన్‌ఈ) సంఫీుభావాన్ని ప్రకటించింది. బాధితులకు అండగా నిలుస్తామని పేర్కొంది. సిరియాపై అమెరికా, నాటో, ఈయూ భయానక ఆంక్షలను తక్షణమే ఎత్తివేయాలని ర్యాలీ డిమాండ్‌ చేసింది. భూకంప ఫాలోఅప్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం: భూకంప ఫాలోఅప్‌ కేంద్రాన్ని తమ శక్తిసామర్థ్యాల మేరకు ప్రభావిత ప్రాంతాల అవసరాలు, ప్రజలకు దీర్ఘకాల ఫలితాలు ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని ఓక్యుయన్‌ ప్రకటించారు. శుభ్రమైన గాలివెలుతురు వచ్చేలా జోన్లు ఏర్పాటు చేస్తామన్నారు. తమతో ప్రతి ఒక్కరు కలిసిరావాలని పిలుపునిచ్చారు. శిథిలాల నుంచి బయటకు వచ్చి తిరిగి స్వీయసమృద్ధి దేశంగా మారుదాం… మన దేశాన్ని శక్తిమంతం చేసుకుందాం… అని ఓక్యుయన్‌ నినాదమిచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img