కాలిఫోర్నియా : అమెరికాలో కాలిఫోర్నియా సిటీ కౌన్సిల్ 2022 జూన్‌లో జరరగనున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కమ్యూనిస్టు పార్టీ (సీపీయూఎస్‌ఏ) సభ్యుడు యుఎస్ ఆర్మీ వెటరన్, కమ్యూనిటీ ఆర్గనైజర్ స్టీవెన్ ఎస్ట్రాడా, డిస్ట్రిక్ట్ 1కి ఎన్నికైనట్లయితే నాలుగు సంవత్సరాలు ఆ పదవిలో కొనసాగుతారు. ఎనిమిదిమందితో కూడిన కౌన్సిల్ సభ్యులకు ప్రాతినిధ్యం వహిస్తారని పీపుల్స్ వరల్డ్ నివేదించింది. ముఖ్యంగా దేశంలో నెలకొన్న పేదరికం, ప్రజారవాణా, అద్దెదారుల హక్కుల బిల్లు, మానసిక ఆరోగ్య వనరుల నిధులు, యువతకు సంబంధించిన ప్రాజెక్టులు, ఉద్యోగాలు, పర్యావరణ పరిరక్షణ వంటి అనేక కీలక అంశాలపై దృష్టి సారించారు. 19 సంవత్సరాల వయసులో ఎస్ట్రాడా అమెరికా సైన్యంలో చేరారు. ఆర్మీలో అతను సేవచేసే సమయంలో సార్జెంట్ స్థాయికి ఎదిగి పారాట్రూపర్‌గా అర్హత సాధించారు. తోటి సైనికులతో పాటు ప్రజలకు సేవలందించడం గర్వంగా ఉన్నప్పటికీ ఈ అనుభవమే అతడిని అమెరికా సామ్రాజ్యవాద దోపిడీ విధానాన్ని గుర్తించగలిగింది. లాంగ్ బీచ్ కాలిఫోర్నియా ఏడవ అత్యధిక జనాభా కలిగిన నగరం. అమెరికాలోని రెండవ అతి పెద్ద షిప్పింగ్ పోర్టు ఉంది. వ్యక్తుల ఐక్యత ద్వారా మాత్రమే మనం పేదరికాన్ని ఎదుర్కొగలమని రియల్ ఎస్టేట్ సంస్థలతో పోలీసు యూనియన్లు, కన్సల్టింగ్ సంస్థలతోఎటువంటి సంబంధం లేదని స్టీవెన్ పేర్కొన్నారు. తమకు రాజకీయ సంస్థల సహకారం లేదని ప్రజా సంక్షేమమే ముఖ్యమని ఎస్ట్రాడా తెలిపారు.