Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

పోరాటయోధుడు చే కు శ్రద్ధాంజలి

వెనిజులా : క్యూబా విప్లవకారుడు చే గువేరా 54వ వర్థంతిని క్యూబా స్మరించుకుంది. 1967లో ఇదే రోజు చే హత్యకు గురయ్యాడు. సామ్రాజ్యవాద నిరంకుశవాద విధానాలకు వ్యతిరేకంగా చే గువేరా పోరాట పటిమ నూతన తరాలకు మార్గదర్శకంగా నిలిచిందని మదురో ట్విట్టర్‌లో పేర్కొన్నారు. చేగువేరా ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాద,నిరంకుశ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం నెరిపిన వ్యకిగా యోధుడిగా పేరుగాంచారు. దక్షిణ అమెరికాలోని అనేక దేశాలకు వెళ్లిన చే అక్కడి ప్రభుత్వ నిరంకుశ విధానాలను వ్యతిరేకించారు. ప్రజలు అనుభవిస్తున్న పేదరికాన్ని, కార్మికుల దుస్థితిని పెట్టుబడీదారీ శక్తులు దోచుకునే విధానాన్ని ప్రత్యక్షంగా అనుభవించారు. 1928లో అర్జెంటీనాలో జన్మించిన చే పూర్తి పేరు ఎర్నెస్టో చే గురేవా. ప్రజలు ఆయన్ని చే అని పిలుచుకునేవారు. వైద్య వృత్తిని అభ్యసించిన చే తన చుట్టూ ఉన్న పేదరికాన్ని చూసి విప్లవమార్గంలో గెరిల్లా పోరాట విధానానికి అంకురార్పణ చేశారు. ఆయా దేశాల్లో పేదల దుస్థితిని ఆకళింపుచేసుకున్నారు. 19521959లో బటిస్టా నియంతృత్వ విధానానికి వ్యతిరేకంగా చే పోరాటం ప్రారంభించేందుకు విప్లవ నాయకుడు కాస్ట్రోతోపాటు 80 మంది ఇతర సభ్యులతో కలిసి గ్రాన్మాలో క్యూబాలో అడుగుపెట్టారు. క్యూబాలో నియంతృత్వ పాలనుకు వ్యతిరేకంగా 1959లో చేపట్టిన క్యూబా విప్లవంలో విజయం సాధించిన తరువాత చే నేషనల్‌ బ్యాంక్‌ అధ్యక్షుడిగా, పరిశ్రమల మంత్రిగా పనిచేశారు 19651967 వరకు అర్జెంటీనా`క్యూబా గెరిల్లా డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో, బొలీవియాలో పోరాడారు. చే తన ప్రయాణాలపై ఒక డైరీ కూడా రాసారు. ఇదే ఆయన మరణానంతంరం ‘ది మోటార్‌సైకిల్‌ డైరీ’గా ప్రచురితమైంది. చే లాటిన్‌ అమెరికా దేశాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఆయన కొంతకాలం కాంగోలో ఉండి తర్వాత బొలీవియాకు వచ్చారు. బొలీవియా అడువుల్లో ఉన్న చేను బొలీవియా పోలీసులు పట్టుకుని కాల్చి చంపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img