Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ప్రధాని పదవి రేసులో సునాక్‌ ముందంజ

లండన్‌: బ్రిటన్‌లో అధికార కన్సర్వేటివ్‌ పార్టీ అధ్యక్షుడు, బ్రిటన్‌ మాజీ ఆర్థిక మంత్రి, భారత సంతతి వ్యక్తి రిషి సునాక్‌ బ్రిటన్‌ ప్రధానమంత్రి రేసులో ముందంజలో ఉన్నారు. బుధవారం జరిగిన మొదటి రౌండ్‌ ఓటింగ్‌లో కన్సర్వేటివ్‌ ఎంపీల ఓట్లలో సునక్‌కు అత్యధికంగా 88 ఓట్లు వచ్చాయి. 67 ఓట్లతో వాణిజ్య శాఖ మంత్రి పెన్నీ మోర్డాంట్‌, 50 ఓట్లతో విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రజ్‌ రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. మాజీ మంత్రి కెమీ బదోనెచ్‌కు 40ఓట్లు, టామ్‌ టుగేన్‌ధాట్‌కు 37ఓట్లు, భారత సంతతికి చెందిన అటార్నీ జనరల్‌ సుయోలా బ్రావెర్మన్‌కు 32ఓట్లతో చివరి స్థానంలో నిలిచారు. ఆర్థికంగా దేశాన్ని బలోపేతం చేయటంలో ద్రవ్యోల్బణం కట్టడికే తొలి ప్రాధాన్యత ఇస్తానని సునాక్‌ పేర్కొన్నారు. కఠిన సవాళ్లను ఎదుర్కోవటంలో తనకు అపార అనుభవం ఉందని, ప్రస్తుత సమయంలో దేశాన్ని ముందుకు నడిపించగలనని ధీమా వ్యక్తం చేశారు. తాను ప్రజలను వారి బ్యాంకు ఖాతాల ద్వారా కాకుండా వారి ప్రవర్తనను భట్టి అంచనా వేస్తానని పేర్కొన్నారు. దేశంలో నెలకొన్న ఆర్థిక సమస్యలపై ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ ‘కరోనా మహమ్మారితో లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారని అది దేశాన్ని ఓ మెట్టు వెనక్కి లాగుంతుందని ముందుగానే ఊహించామని అన్నారు. ప్రధానిగా బాధ్యతలు చేపడితే ద్రవ్యోల్బణం కట్టడికే తొలి ప్రాధాన్యతగా పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img