Friday, April 19, 2024
Friday, April 19, 2024

ప్రపంచ దేశాలతో స్నేహం సహకారం మరింత పటిష్టం

జిన్‌పింగ్‌ పిలుపు

బీజింగ్‌ : ప్రపంచ దేశాల ప్రజలతో సంబంధాలను మరింత పటిష్టపర్చుకోవాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ పిలుపునిచ్చారు. మానవాళి భవిష్యత్‌ కోసం ఐక్యసమాజాన్ని నిర్మిద్దామన్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి కూడా అయిన జిన్‌పింగ్‌ చైనా పార్టీ, రాష్ట్ర నేతలు, విదేశీ అధినేతల బహుమతులను ప్రదర్శనశాలను ఆయన సందర్వించారు. ఈ బహుమతులు, ఇతర దేశాలకు, పీపుల్స్‌ ఆఫ్‌ చైనాకు మధ్య పటిష్ట బంధమని పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా (పీఆర్‌సీ) దౌత్య విజయాలకు చిహ్నం అని జిన్‌పింగ్‌ అన్నారు. చైనా ప్రజల బాగోగులతో పాటు యావత్‌ మానవాళి పురోగతికి సీపీసీ కృషిచేస్తుందని చెప్పారు. ఈ ప్రదర్శనశాలలో 670 కానుకలు, 40కుపైగా ఫొటోలు, దాదాపు 100 ఆర్చివ్‌లు, అబ్‌స్ట్రాక్ట్‌లు, మల్టీమీడియా పరికరాలు ఉన్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు రిచర్డ్‌ నిక్సన్‌ బహూకరించిన హంసలు, బ్రిటన్‌, కజకస్థాన్‌, ఇండోనేషియా, కొరియా, కెన్యా, గ్రీస్‌, బొలివియా, ఫిజీ దేశాల ప్రస్తుత, మాజీలు ఇచ్చిన కానుకలు ఉన్నాయి. మరోవైపు ఆసియా`పసిఫిక్‌ ఎకటనామిక్‌ కోఆపరేషన్‌ (అపెక్‌) నేతలతోనూ జిన్‌పింగ్‌ అనధికారికంగా భేటీ అయ్యారు. ఈ సమావేశాన్ని అపెక్‌ చైర్‌ న్యూజిలాండ్‌ నిర్వహించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img