Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

ఫిలిప్పీన్స్‌లో ఉల్లిఘాటు

కిలో రూ.1200పైమాటే…
14ఏళ్ల గరిష్ఠానికి ద్రవ్యోల్బణం

మనీలా: ఉల్లిఘాటు ఫిలిప్పీన్స్‌ను కన్నీరు పెట్టిస్తోంది. ఆ దేశ రాజధాని మనీలాలో కిలో ఉల్లి ధర రూ.1200 కుపైగానే పలుకుతోంది. దీంతో సామాన్యుల వంటగదుల్లోనే కాకుండా రెస్టారెంట్లలోనూ ఉల్లి జాడ లేకుండా పోయింది. పిలిప్పీన్స్‌లో ద్రవ్యోల్బణం 14 ఏళ్ల గరిష్ఠానికి చేరింది. ఈ నేపథ్యంలో ఉల్లి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. చిన్న ఉల్లి ఒక్కొక్కటి రూ.120 లెక్కన అమ్ముతుంటే కొనలేక దానిని వాడటమే మానేశామని స్థానికురాలు క్యాండీ రోసా (56) తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఉల్లి పంట చేతికి రాక ముందే వాటిని తవ్వి అమ్మకానికి తెస్తున్నారు. దీంతో డిమాండుకు సరిపడా సరఫరా ఉండేలా విదేశాల నుంచి 21వేల టన్నుల ఉల్లి దిగుమతికి ఫలిప్పీన్స్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఉల్లిని నిల్వ చేస్తున్న వ్యాపారుల గోడౌన్లపై ఆకస్మిక దాడులకు ఆదేశాలిచ్చింది. కానీ ఉల్లి ధర దిగి రావడం లేదు. ఎన్నడూ లేని విధంగా ఉల్లి ధరలు అమాంతం పెరిగినట్లు రైతులు చెప్పారు. మధ్య ఆసియా నుంచి మనీలాకు వచ్చిన ఓ విమానంలో ఉల్లిపాయల బస్తాలను ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా వీటిని తరలించినట్లు గుర్తించారు. అధికారిక గణాంకాల ప్రకారం ఒక్కో పౌరుడు ఏడాదికి సగటున 2.34 కిలోల ఉల్లిని వినియోగిస్తారు. దేశీయ అవసరాలను తీర్చే స్థాయిలో ఉల్లి ఉత్పత్తి ఉన్నాగానీ వాతావరణ పరిస్థితుల వల్ల ఏడాదికి ఒకసారి మాత్రమే ఉల్లి సాగుకు అవకాశం ఉంటుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img