Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఫ్లోరిడాలో టోర్నడోల బీభత్సం

జనజీవనం అస్తవ్యస్తం: కార్లు ధ్వంసం

ఫ్లోరిడా: అమెరికాలో టోర్నడోలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఫ్లోరిడాలోని నార్త్‌ పామ్‌ బీచ్‌లో టోర్నడో తీవ్రత ఎక్కువగా ఉంది. పెనుగాలులతో అనేక ఇళ్లు, షాపింగ్‌ మాల్స్‌ కుప్పకూలాయి. మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. గాలి తీవ్రతకు చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేల కూలాయి. టోర్నోడోల విధ్వంసానికి విద్యుత్‌ వ్యవస్థ దెబ్బతిని, లక్షలాది ఇళ్లు చీకట్లలోనే ఉన్నాయి. పెనుగాలుల వల్ల అక్కడక్కడ అగ్నిప్రమాదాలు కూడా చోటుచేసుకున్నాయి. రవాణా వ్యవస్థ స్థంభించింది. దీంతో అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికో నుంచి వీస్తున్న భీకర గాలుల ప్రభావం టెక్సాస్‌ మీదుగా పలు ప్రాంతాల్లో ప్రభావం చూపుతాయని అమెరికా వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫ్లోరిడాలో టోర్నడోలతో అపారనష్టం జరిగింది. టోర్నడోల ధాటికి చాలా కార్లు ధ్వంసమయ్యాయి. కార్లు కొట్టుకుపోవడమే కాకుండా అవి కొద్దిసేపు గాల్లో చక్కర్లు కొట్టి, ఆపై పల్టీలు కొడుతూ ఒక దానిపై ఒకటిగా పడిపోవడం వంటి ఘటనలు స్థానికులను భయపెట్టాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img