Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

బీరుట్‌ బాధితులకు న్యాయం చేయాలి

బీరుట్‌: బీరుట్‌ పోర్టులో భారీ పేలుడు జరిగి సంవత్సరం గడిచిన సందర్భంగా..బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ బీరుట్‌పోర్టులో ప్రజలు భారీ నిరసనలకు దిగారు. పేలుళ్లవెనుక నిజానిజాలు వెల్లడిరచాలని, పారదర్శకమైన దర్యాప్తు చేపట్టాని బాధితుల కుటుంబాలు కోరాయి. దీనికి కారణమైన అధికారులపై ప్రభుత్వం ఎటువంటి విచారణ చేపట్టలేదని ప్రజలు ఆగ్రహించారు. సెంట్రల్‌ బీరుట్‌లో నిరసనకారులు తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. అధికారులు విచారణనుండి తప్పించుకుంటున్నారని లెబనాన్‌ ప్రభుత్వ అధికారులు కుంటిసాకులు చెప్పడం సరైందికాదన్నారు. నిరసనకారులు పార్లమెంటు ప్రధాన కార్యాలయాన్ని ముట్టడికి ప్రయత్నించగా భద్రతాదళాలు ఆందోళనకారులపై టియర్‌గ్యాస్‌ ప్రయోగించారు. ఈ ఘర్షణల్లో ఎనిమిదిమంది గాయపడ్డారు. పోర్డులో జరిగిన పేలుడుకు జవాబుదారీ, న్యాయంకోసం వీరు డిమాండ్‌ చేశారు. ఈ ఘోరవిపత్తుపై విచారణను నిలిపివేశారని ఆరోపించారు. ఓ పక్క లెబనాన్‌ ఆర్థికంగా గణనీయంగా క్షీణిస్తుండగా..మరోవైపు సంక్షోభాన్నిఎదుర్కోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని దుయ్యబట్టారు. పేలుడు జరిగి సంవత్సరం గడిచినా భారీ సంఖ్యలో అమ్మోనియం నైట్రేట్‌ ఓడరేవులో సంవత్సరాల తరబడి పేరుకుపోయి ఉంది. ఇది చాల మంది లెబనీయన్లను ఆగ్రహానికి గురిచేసంది. ఈ పేలుడులో 214 మందికిపైగా మరణించారు వేలాదిమంది గాయపడ్డారు. దీనిపై ఏ సీనియర్‌ అధికారి కూడా జవాబుదారీగా లేదు. వేలాదిమంది చనిపోయినవారి చిత్రాలు పట్టుకుని లెబనీస్‌ జెండాలు ఊపుతూ పోర్టు దగ్గర నిరసించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img