Friday, April 19, 2024
Friday, April 19, 2024

బెలారస్‌ ప్రతిపక్ష నేతకు జైలుశిక్ష

కీవ్‌: బెలారస్‌ ప్రతిపక్ష నేతకు 11సంవత్సరాల జైలుశిక్ష విధించడమైంది. అధ్యక్షుడు లుకషెంకోకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టినందుకుగాను మరియా కోలెస్నికోవాకు బెలారసియన్‌ కోర్టు 11సంవత్సరాల జైలుశిక్ష విధించింది. మ్యూజిక్‌స్టార్‌ అయిన మరియా తన నిరసన ప్రదర్శనలతో రాజకీయవేత్త అయ్యారు. కోలెస్నికోవా, ప్రతిపక్ష కార్యకర్త మాగ్జిమ్‌లపై తీవ్రవాద అభియోగాలు మోపారు. రాజ్యాంగ విరుద్ధమైన రీతిలో దేశఅధికారాన్ని స్వాధీనం చేసుకోవడానికి కుట్ర పన్నారని బెలారసియన్‌ మీడియా వెల్లడిరచింది. అధికారం కోసం ఎన్నికల్లో లుకషెంకో రిగ్గింగ్‌కుపాల్పడ్డారని మరియా ఆరోపించింది. 1994 నుంచి బెలారస్‌ అధ్యక్షుడిగా లుకషెంకో కొనసాగుతున్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img