Friday, April 19, 2024
Friday, April 19, 2024

బైడెన్‌ ఎక్స్‌పోర్ట్‌ కౌన్సిల్‌లోకి పుతిన్‌ రంజన్‌, రాజేశ్‌ సుబ్రమణ్యం

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తన శక్తిమంతమైన ఎక్స్‌పోర్ట్‌ కౌన్సిల్‌లో ఇద్దరు భారత సంతతి అమెరికా కార్పొరేట్‌లకు స్థానం కల్పించారు. అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రధాన సలహా కమిటీగా ఎక్స్‌పోర్ట్‌ కౌన్సిల్‌ ఉంది. డెలాయిట్‌ కన్సల్టింగ్‌ మాజీ సీఈవో పునిత్‌ రంజన్‌, ఫెడెక్స్‌ ప్రస్తుత అధ్యక్షుడు, సీఈవో రాజేశ్‌ సుబ్రమణ్యం పేర్లను బైడెన్‌ ఈ కమిటీ కోసం నియమించినట్లు శ్వేతసౌధం వెల్లడిరచింది. ఎక్స్‌పోర్ట్‌ కౌన్సిల్‌ చైర్మన్‌గా మార్క్‌ ఎడ్విన్‌ (కాస్టెల్‌ సిస్టమ్స్‌ చైర్మన్‌) ఉంటారు. కార్పొరేట్‌ రంగంతో పాటు కార్మిక, రియల్‌ ఎస్టేట్‌, జాతీయ భద్రత, న్యాయ రంగాలకు చెందిన 25 మందికిపైగా ఎక్స్‌పోర్ట్‌ కౌన్సిల్‌ సభ్యులుగా ఉన్నారు. వీరిలో కారెన్‌ ఎస్‌.లించ్‌ (సీవీఎస్‌ హెల్త్‌ సీఈవీ, అధ్యక్షుడు), జాన్‌ లావ్లర్‌ (ఫార్డ్‌ సీఎఫ్‌వో), గారెత్‌ జోయ్‌సే (ప్రెటెర్రా సీఈవో), బ్రెట్‌ హర్ట్‌ (యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ అధ్యక్షులు), బెత్‌ ఫోర్డ్‌ (లాండ్‌ ఓ లేక్స్‌ అధ్యక్షులు, సీఈవో), క్ట్రిస్టియానో ఆర్‌. ఆమన్‌ (క్వాల్‌కామ్‌ సీఈవో) వంటి ప్రముఖులు ఉన్నారు. కాగా రంజన్‌ గతేడాది డిసెంబరు 31న డెలాయిట్‌ గ్లోబల్‌ సీఈవోగా రిటైరయ్యారు. ప్రస్తుతం డెలాయిట్‌ గ్లోబల్‌ సీఈవో ఎమిరటస్‌గా ఉన్నారు. అలాగే సుబ్రమణ్యం.. ఫెడెక్స్‌ కార్పొరేషన్‌ అధ్యక్షునిగా, సీఈవోగా కొనసాగుతున్నారు. ఐదుగురితో కూడిన ఎగ్జిక్యూటివ్‌ కమిటీ, ఫెడెక్స్‌ స్ట్రాటజిక్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ చైర్‌గానూ కీలక బాధ్యతల్లో ఆయన ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img