Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

బ్యాంకాక్‌లో నిరసనలు

ప్రధాని రాజీనామాకు డిమాండ్‌

బ్యాంకాక్‌ : కరోనా నియంత్రణ, ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో థాయ్‌లాండ్‌ ప్రభుత్వం విఫలమైనందుకు థాయ్‌ రాజధానిలో వేలాది మంది నిరసనలు చేపట్టారు. రాజధాని బ్యాంకాక్‌ భారీ నిరస నలతో హోరెత్తింది. విక్టరీ మాన్యుమెంట్‌ సమీపంలోని రహ దారుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ప్రదాని ప్రయుత్‌ చాన్‌ ఓచా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆయన కార్యాలయం వద్దకు చేరుకున్నారు. నిరసనకారులపై జలఫిరంగులు, టియర్‌ గ్యాస్‌, బులెట్లను యంత్రాంగం ప్రయోగించింది. దీనితో రెచ్చిపోయిన నిరసనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. ఆ ప్రదేశంలో తీవ్ర ఉద్రిక్తతలు చెలరే గాయి. నిరసనకారులు నాటు బాంబులు, రాళ్లు, గోళీలు విసరడంతో ఘర్షణలకు దారి తీసింది. డజన్లకొద్దీ నిరసనకారులు గాయపడ్డారు. సాధారణ పౌరులతోపాటు అధికారులు ఈ ఘర్షణల్లో గాయపడ్డారని ఎరవాన్‌ ఎమర్జన్సీ మెడికల్‌ సెంటర్‌ ప్రకటించింది. శనివారం థాయ్‌లాండ్‌లో 22 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వం టీకాల కార్యక్రమాన్ని నిదానంగా కొనసాగించడాన్ని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. రాచరికంలో మార్పులు చేయాలని ప్రజలు కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img