Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

బ్రెజిల్‌ అధ్యక్షుడిపై ఆదివాసీల కేసు..!

బ్రసీలియా : బ్రెజిల్‌ అధ్యక్షుడు జైరో బోల్సోనారో ప్రభుత్వంపై దేశంలోని ఆదివాసీ తెగ అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టులో కేసు పెట్టింది. 2019లో బోల్సోనారో అధికారం చేపట్టిననాటినుండి స్వదేశీ వ్యతిరేక విధానానికి నాయకత్వం వహించారని హేగ్‌` ఆధారిత కోర్టుకు దాఖలు చేసిన కేసులో బ్రెజిల్‌ ఆదివాసీలు ఆరోపించారు. బ్రెజిల్‌లోని అమెజాన్‌ అడవులు ప్రపంచంలోనే పెద్ద అడవులు. అందులో దాదాపు తొమ్మిది లక్షల మంది ఆదివాసీ తెగలకుచెందిన వారు 462 ప్రత్యేక గుర్తింపు ఉన్న ప్రాంతాల్లో(రిజర్వుడు ఫారెస్ట్‌) నివసిస్తున్నారు. ఇప్పుడు బోల్సోనారో ప్రభుత్వం వారిని అక్కడ నుంచి గెంటివేసి ఆ ప్రాంతాలను పెద్ద పెద్ద ఆయిల్‌, మైనింగ్‌ సంస్థలకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధంచేసింది. అక్కడ మైనింగ్‌ చేసేందుకు చెట్లు నరికివేస్తే సమతుల్యత పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. ఈ అడవిలో అనేక రకాల చెట్లు, జంతువులకు ఆలవాలం. బోల్సోనారో ప్రభుత్వం తమ జాతులపై దాడి చేశారని ఆయా నాయకులు ఆరోపించడం ఇది మొదటిసారి కాదు. బ్రెజిల్‌లో మానవత్వం, మారణహోమం, ఎకోసైడ్‌పై నేరాలు జరుగు తున్నాయని ఆదివాసీ సంస్థల లీగల్‌ కో ఆర్డి నేటర్‌ ఎలోయ్‌ తెలిపారు. శుక్రవారం విడుదల చేసిన అధికారిక గణాంకాలు బ్రెజిలియన్‌ అమెజాన్‌లో అడవుల నిర్మూలన జూలై వరకు రికార్డు స్థాయికి చేరుకున్నాయి, దాదాపు ప్యూర్టో రికో పరిమాణాన్ని నాశనం చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img