Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

‘బ్లింకెన్‌ గో హోమ్‌’

అ అమెరికానాటో స్థావరాల తొలగింపుకు గ్రీక్‌ కమ్యూనిస్టుల డిమాండ్‌ అ ఏథెన్స్‌, థెస్సలోనికిలో భారీ నిరసన ప్రదర్శన ఏథెన్స్‌: గ్రీస్‌లో అమెరికా కార్యదర్శి ఆంటోనియో బ్లింకెన్‌ పర్యటనను గ్రీక్‌ కమ్యూనిస్టు పార్టీ (కేకేఈ), గ్రీస్‌ కమ్యూనిస్టు యువత (కేఎన్‌ఈ) తీవ్రంగా ఖండిరచాయి. సరిహద్దు ప్రాంతంలో అమెరికానాటో ప్రణాళికలు తమ దేశానికి ప్రమాదకరంగా నొక్కిచెప్పాయి. ఉక్రెయిన్‌లో నాటో, రష్యా యుద్ధం క్రమంలో ఆ దేశ సైనిక కార్యకలాపాలను గ్రీస్‌ కమ్యూనిస్టులు నిరసించారు. ‘బ్లింకెన్‌ గో హోమ్‌’ నినాదాలు చేశారు. ఏథెన్స్‌, థెస్సలోనికిలో నాటో స్థావరాల ఏర్పాటును వ్యతిరేకించారు. సామ్రాజ్యవాద చర్యల్లో జోక్యం వద్దు, గ్రీస్‌లో నాటోఅమెరికా స్థావరాలు వద్ద అంటూ వేలాది మంది యువతీ, యువకులు, కమ్యూనిస్టులు నిరసన గళాన్ని వినిపించారు. అమెరికా దౌత్యకార్యాలయం వరకు మార్చ్‌ నిర్వహించారు. గ్రీస్‌లో ‘యుద్ధ మంత్రి’ అమెరికాకు ప్రవేశం లేదని నినాదాలు చేశారు. తమ దేశంలో అమెరికానాటో స్థావరాలను తక్షణమే మూసివేయాలని డిమాండ్‌ చేశారు. థెస్సాలోనికిలోనూ భారీ నిరసన ప్రదర్శన జరిగింది. ‘థెస్సాలోనికి ప్రజల పోర్టు… సామ్రాజ్యవాదుల స్థావరం కాదు’, ప్రజా హంతకులకు నీరు లేదు, భూమి లేదు’ అన్న నినాదాలు మార్మ్రోగాయి. సిటీసెంటర్‌లోని అమెరికా రాయబార కార్యాలయం వద్దకు చేరుకొని నిరసన తెలిపారు. కేకేఈ ఎంపీలు జియన్నిస్‌ దెలిస్‌, లియోనిదాస్‌ స్టోడిసిస్‌, పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ర్యాలీలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img