Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

భయపెడుతున్న భూకంపాలు

. ఫిలిప్పీన్స్‌లో ప్రకంపనలు
. రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 6.1గా నమోదు
. టర్కీ, సిరియాలో 41వేలు దాటిన మృతుల సంఖ్య

మనీలా: వరుస భూకంపాలు ప్రపంచ దేశాలను భయపెడుతున్నాయి. ఇటీవల టర్కీ, సిరియా దేశాల్లో సంభవించిన భారీ భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అపార ప్రాణ`ఆస్తినషం కలిగించింది. న్యూజిలాండ్‌లో బుధవారం 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. గురువారం ఫిలిప్పీన్స్‌లో భూమి కంపించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.1గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే (యూఎస్‌జీఎస్‌) వెల్లడిరచింది. గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత (స్థానిక కాలమానం ప్రకారం 2.00 గంటలకు) సెంట్రల్‌ ఫిలిప్పీన్స్‌లో ప్రకంపనలు సంభవించాయి. మస్బేట్‌ ప్రావిన్స్‌లోని మియాగా గ్రామానికి 11 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఏర్పడిరదని యూఎస్‌జీఎస్‌ వెల్లడిరచింది. రాత్రి నిద్రలో ఉండగా భూకంపం సంభవించడంతో ఒక్కసారిగా ప్రజలు ఉలిక్కిపడ్డారు. భవనాల నుంచి బయటికి పరుగులు తీశారు. భూకంపం వల్ల నష్టం వాటిల్లింన్నట్లు సమాచారం లేదు. సునామీ హెచ్చరికలు జారీ కాలేదు. భవనాలు కూలినట్టు సమాచారం లేదని డిమాసలాంగ్‌ మున్సిపాలిటీ డిజాస్టర్‌ ఆఫీసర్‌ గ్రెగోరియో అడిగ్యూ వెల్లడిరచారు. పసిఫిక్‌ తీరానున్న ఫిలిప్పీన్స్‌లో తరచుగా ప్రకంపనలు సంభవిస్తుంటాయిగానీ 6 కంటే ఎక్కువ తీవ్రతతో భూకంపాలు రావడం అరుదు. గతేడాది అక్టోబర్‌లో ఈశాన్య ఫిలిప్పీన్స్‌లో 6.4 తీవ్రతతో భూకంపం రాగా తీవ్రంగా నష్టం వాటిల్లింది.
టర్కీకి 84 బిలియన్‌ డాలర్ల నష్టం!
టర్కీ, సిరియా అపారంగా నష్టపోయాయి. వేలాది భవనాలు కుప్పకూలాయి. మృతుల సంఖ్య 41వేలు దాటింది. ఒక్క టర్కీలోనే 38వేలకుపైగా మరణాలు సంభవించాయి. పునరావాస కేంద్రాల్లో లక్షలాది మంది ఆశ్రయం పొందుతున్నారు. దేశ చరిత్రలోనే అత్యంత ఘోరమైన విపత్తుగా టర్కీ ఇప్పటికే ప్రకటించింది.శిథిలాల కింద కదలికలు కనిపించని నేపథ్యంలో సహాయక చర్యలు తుది దశకు చేరుకున్నాయి. వందలాది మంది గల్లంతయ్యారు. 85వేలకుపైగా ప్రజలు గాయపడ్డారు. ప్రభుత్వ సాయం అందక అనేక కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయి. గుడారాల్లో జీవిస్తూ ఆపన్నహస్తం కోసం నిరీక్షిస్తూ ప్రతి క్షణం ఒక యుగంగా గడుపుతున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img