Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

భారత్‌పై ఐఎస్‌ ఉగ్ర కుట్ర..సూసైడ్‌ బాంబర్‌ను అదుపులోకి తీసుకున్న రష్యా

ఆత్మాహుతి దాడి కోసం భారత్‌ వచ్చేందుకు ప్రయత్నిస్తోన్న ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదిని రష్యా అదుపులోకి తీసుకుంది. ఈ మేరకు రష్యాకు చెందిన ఫెడరల్‌ సెక్యూరిటీ సర్వీస్‌ (ఎఫ్‌ఎస్‌బీ) ఓ ప్రకటన జారీ చేసింది. రష్యా అదుపులోకి తీసుకున్న ఉగ్రవాదిని మధ్య ఆసియా ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. భారత్‌లో అధికారంలో ఉన్న నాయకులపై దాడికోసం ప్లాన్‌ చేసిన అతడు ఈ క్రమంలో వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.రష్యా నుంచి భారత్‌ వెళ్లడం కోసం అవసరమైన డాక్యుమెంట్లను పూర్తి చేసి.. ఇండియాలో ‘హై ప్రొఫైల్‌’ వ్యక్తులపై ఆత్మాహుతి దాడులకు పాల్పడాలని అతడికి ఇస్లామిక్‌ స్టేట్‌ నుంచి సూచనలు ఉన్నాయని ఎఫ్‌ఎస్‌బీ తెలిపింది. అతడిని ఐఎస్‌కు చెందిన ఓ ఉగ్రవాద నాయకుడు రిక్రూట్‌ చేసుకొని.. టర్కీలో సూసైడ్‌ బాంబర్‌గా శిక్షణ ఇచ్చారని వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img