Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మత స్వేచ్ఛ చట్టం కోసం బంగ్లాలో ర్యాలీ

ఢాకా : దేశంలోని ప్రతి ఒక్కరి మత స్వేచ్ఛను కాపాడేందుకు ఒక చట్టాన్ని రూపొందించాలని డిమాండ్‌ చేస్తూ బంగ్లాదేశ్‌లో విద్యావేత్తలు దేశవాప్త ఆందోళన చేపట్టారు. దూర్గా పూజ ఉత్సవాల సమయంలో హిందూ ఆలయాలపై మతోన్మాద శక్తులు సాగించిన విగ్రహాల దాడులను నిరసిస్తూ విద్యార్థులు, విద్యావేత్తలు భారీ ఎత్తున ప్రదర్శన చేపట్టారు. నేరస్థులను గుర్తించి తగిన శిక్ష వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని నినదించారు. ఢాకా వర్సిటీ క్యాంపస్‌లో వర్సిటీలోని వివిధవిభాగాల నుండి 100మందికిపైగా ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పండుగ అన్ని మతాల ప్రజలకు అందుబాటులో ఉండాలని మతం పేరిట ప్రజలను చీల్చవద్దు, మతోన్మాదుల కుట్రలు సాగనివ్వం అంటూ గళమెత్తారు. ప్రార్థనా స్థలాలపై దాడులకు పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలని ప్రధాని షేక్‌ హసీనా ఆదేశాలు జారీ చేశారు. బంగ్లా మండుతోంది అంటూ వర్సిటీకి చెందిన విద్యార్థులు, టీచర్లు వీధినాటకం ప్రదర్శించారు. ప్రగతిశీల విద్యార్థుల సమాఖ్య కార్యకర్తలు, ఖుల్నావర్సిటీ అసోసియేషన్‌ నేతలు ఆలయాలపై దాడులను ఖండిరచారు. ఖురాన్‌ను అవమానించారని ఆరోపిస్తూ హిందువులపై ఇస్లామిక్‌ రాడికల్స్‌ దాడులు చేస్తున్నారు. హిందువుల ఇళ్లపై కూడా దాడులు చేస్తున్నారు. మైనారిటీల హక్కులను కాపాడటం ప్రభుత్వ బాధ్యత..బంగ్లాదేశ్‌ ఆ భాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమైందని ఎఐయుడిఎఫ్‌ అధ్యక్షుడు ఎంపీ మౌలానా బద్రుద్దీన్‌ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img