Friday, April 19, 2024
Friday, April 19, 2024

మధ్యప్రాచ్యంలో అమెరికా జోక్యం తగదు : చైనా

నానింగ్‌ : మధ్యప్రాచ్య దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం తగదని అమెరికా, పశ్చిమ దేశాలను చైనా హెచ్చరించింది. తమ స్వప్రయోజనాలకు అనుగుణంగా ఈ ప్రాంతాన్ని మార్చే ప్రయత్నం మానుకోవాలని చైనా పేర్కొంది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యి, సిరియా కౌంటర్‌ ఫైసల్‌ మెక్దాద్‌తో వీడియో లింక్‌ ద్వారా చర్చలు జరుపుగుతున్న సందర్భంలో ఈ వ్యాఖ్యలు చోటుచేసుకున్నాయి. సహకారం, బహుళపాక్షికత, శాంతి కోసం పిలుపునిచ్చిన వాంగ్‌, మధ్యప్రాచ్య ప్రజలకు చైనా మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు. ఐక్యత, స్వీయ-అభివృద్ధి నేపధ్యంలో ప్రాంతీయ భద్రతా సమస్యలను పరిష్కరించడంలో చైనా మధ్యప్రాచ్య దేశాలకు మద్దతు ప్రకటించింది. పలస్తీనా సమస్య మధ్యప్రాచ్య దేశాల సమస్యలో ప్రధానమైనదిగా పేర్కొన్నారు. పలస్తీనా సమస్యను అంతర్జాతీయ ఎజెండాలో అగ్రస్థానంలో ఉందని వాంగ్‌ పేర్కొన్నారు. మధ్యప్రాచ్య ప్రజలకు శాంతి, స్థిరత్వం లక్ష్యంగా వివిధ సమస్యలను పరిష్కరించగల సామర్థ్యం కలిగి ఉన్నారని వాంగ్‌ పేర్కొన్నారు. చైనా-సిరియాల మధ్య స్థిరమైన, ఆరోగ్యకరమైన అభివృద్ధికోసం చైనా సిద్ధంగా ఉందని వాంగ్‌ తెలిపారు. సిరియా సార్వభౌమత్వం, స్వాతంత్య్రం, ప్రాదేశిక సమగ్రత, జాతీయ గౌరవాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. సిరియాలో శాంతి, స్థిరత్వాన్ని పునరుద్ధరించాలని వాంగ్‌ ఆకాంక్షించారు. దేశ భవిష్యత్తును నిర్ణయించేది సిరియా ప్రజలే అని పేర్కొన్న వాంగ్‌,ి సిరియాకు మానవతా సహాయం అందించాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. చైనా ఎప్పుడూ హేతుబద్ధమైన, న్యాయమైన స్థానానికి కట్టుబడి ఉందని, బహుళ-ధ్రువ ప్రపంచంలో మానవ అభివృద్ధి,పురోగతిని ప్రోత్సహించడంలో చైనా క్రియాశీల పాత్ర పోషించిందని మెక్దాద్‌ అన్నారు. చైనా అంతర్గత వ్యవహారాల్లో బాహ్య శక్తుల జోక్యాన్ని వ్యతిరేకిస్తూ జిన్‌జియాంగ్‌, హాంకాంగ్‌, టిబెట్‌లపై అమెరికా, పశ్చిమ దేశాలు వ్యాప్తి చేస్తున్న పుకార్లను వారి ఓటమిగా మెక్దాద్‌ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img