Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

మసీదులో భారీ పేలుడు.. 100మంది మృతి!

కాబుల్‌: తాలిబన్ల పాలనలో ఉన్న అఫ్గానిస్థాన్‌ మరోసారి భారీ పేలుడుతో దద్దరి ల్లింది. ఉత్తర అఫ్గానిస్థాన్‌లోని కుందుజ్‌ ప్రావి న్స్‌లో ఓ మసీదులో శక్తిమంతమైన పేలుడు సంభవించింది. శుక్రవారం ఖాన్‌ అబాద్‌ ప్రాంతంలోని షియాల మసీదులో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ముష్కరులు జరిపిన ఈ పేలుళ్లలో కనీసం 100మంది దుర్మరణం చెందినట్టు పోలీసులు వెల్లడిరచారు. అనేక మంది గాయపడినట్టు తెలిపారు. ప్రార్థనలు చేసుకుంటున్న సమయంలో పేలుడు శబ్దం వినబడినట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్టు అంతర్జాతీయ వార్తా సంస్థలు పేర్కొన్నాయి. పేలుడు సమయంలో మసీదులో వందలాది మంది ముస్లింలు ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనపై తాలిబన్ల ముఖ్య అధికార ప్రతినిధి జాబిహుల్లా ముజాహిద్‌ స్పందించారు. షియాల మసీదు లక్ష్యంగా జరిగిన ఈ పేలుడులో పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించినట్టు వెల్లడిరచారు. అలాగే, అనేక మంది గాయాలపాలైనట్టు తెలిపారు. తాలిబన్ల ప్రత్యేక బలగాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఇంతవరకు ఏ గ్రూపు ప్రకటన చేయలేదు. అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న తర్వాత అక్కడ ఇస్లామిక్‌ స్టేట్‌ ముఠా దాడులు పెరుగుతున్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. గతంలో కూడా అనేకసార్లు షియా ముస్లింలపై ఇస్లామిక్‌ స్టేట్‌ మిలిటెంట్లు దాడిచేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img