Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మహిళా ఉద్యోగికి బిల్‌గేట్స్‌ వెకిలి ఇ`మెయిల్స్‌..!

న్యూయార్క్‌ : వ్యాపార దిగ్గజం, మైక్రోసాఫ్ట్‌ సహవ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌.. 2008లో ఓ మహిళా ఉద్యోగిని వేధించేవారు. ఆమెకు వెకిలి ఇమెయిల్స్‌ పంపేవారు. ఆయన్ని మైక్రోసాఫ్ట్‌ ఓ సందర్భంలో హెచ్చరించింది కూడా. ఇప్పుడు ఈ విషయాన్ని సంస్థ స్వయంగా వెల్లడిరచిందని అమెరికాకు చెందిన వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఓ కథనం ప్రచురించింది. ప్రస్తుత మైక్రోసాఫ్ట్‌ అధ్యక్షుడు, అప్పటి వైస్‌ ఛైర్మన్‌ బ్రాడ్‌ స్మిత్‌.. మరో అధికారితో కలిసి ఈ విషయంపై గేట్స్‌ను అప్పట్లో కలిశారని, ఇమెయిల్స్‌పై వారు ఆరా తీసినట్టు పత్రిక పేర్కొంది. ఈ వ్యవహారాన్ని గేట్స్‌ కొట్టిపారేయలేదని, అయితే ఆ మహిళా ఉద్యోగి- వ్యాపార దిగ్గజం మధ్య ఎలాంటి లైంగిక బంధం లేకపోవడం వల్ల సంస్థ ఆయనపై చర్యలు తీసుకోలేదని వార్తాపత్రిక వెల్లడిరచింది. ఈ కథనంపై మరిన్ని వివరాలు వెల్లడిరచేందుకు సంస్థ నిరాకరించింది. అయితే వాల్‌స్ట్రీట్‌ ప్రచురించింది మాత్రం నిజమేనని సంస్థ అంగీకరించింది. అటు బ్రాడ్‌ స్మిత్‌ కార్యాలయం ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే బిల్‌గేట్స్‌ వ్యక్తిగత కార్యాలయం మాత్రం దీనిని తీవ్రంగా ఖండిరచింది. ‘అసలు ఏం జరిగిందో తెలియని వారు, విషయంపై సరైన అవగాహన లేని వారి నుంచి ఈ ఊహాగానాలు వెలువడ్డాయి. వాటిల్లో ఏ మాత్రం నిజం లేదు’ అని ఓ ప్రకటనను విడుదల చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img