Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

మాటలకు అందని విషాదం

అడానా: టర్కీ, ఉత్తర సిరియాలో శక్తిమంతమైన భూకంపం మాటలకు అందని విషాదాన్ని మిగిల్చింది. మృతుల సంఖ్య మంగళవారానికి ఐదు వేలను దాటింది. వరుస భూప్రకంపనలు, అనుకూలించని వాతావరణంలో సహాయక చర్యలకు ఆటంకాలు ఏర్పడ్డాయి. అయితే
ప్రపంచ దేశాలు సంఫీుభావం తెలుపుతూ తమ వంతు సాయం చేయడానికి ముందుకొచ్చాయి. ఈ విషాదం నేపథ్యంలో టర్కీ అధ్యక్షుడు ఎర్దోగన్‌ దేశంలో ఏడు రోజుల సంతాప దినాలను ప్రకటించారు. శక్తిమంతమైన భూకంపం ధాటికి టర్కీ, సిరియాలలో అనేక భవనాలు పేకమేడల్లా కూలిపోగా ఒక్క టర్కీలోనే 5,600లకుపైగా భవనాలు నేలమట్టమయ్యాయి .రెండు దేశాల్లో ఇప్పటివరకు 5,100 మందికిపైగా మరణించారు. టర్కీలోని పది ప్రావిన్సుల్లో 3,381 మంది చనిపోగా 20వేల మంది గాయపడినట్లు టర్కీ అధికారులు మంగళవారం తెలిపారు. సిరియాలోని ప్రభుత్వ అధీన ప్రాంతాల్లో 769 మంది చనిపోగా 1,450 మంది గాయపడినట్లు ఆరోగ్యశాఖ వెల్లడిరచారు. రెబల్‌ గ్రూపుల అధీనంలోని ప్రాంతాల్లో 450 మంది చనిపోగా వందలాది మంది గాయపడ్డారు. శిథిలాల కింద అనేక మంది చిక్కుకున్నారని, మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు వెల్లడిరచింది. టర్కీలోని హతరు అంతర్జాతీయ విమానాశ్రయంలోని రన్‌వే రెండుగా చీలిపోయిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీంతో విమాన రాకపోకలను నిలిపివేశారు. శిథిలాల కింద బిడ్డకు జన్మించి తల్లి మరణించిన మనస్సులను కదలించే ఘటన టర్కీలో చోటుచేసుకుంది. పసికందు సురక్షితంగా ఉన్నట్లు సహాయ అధికారులు తెలిపారు. వైద్య సిబ్బంది నిర్విరామంగా పనిచేస్తున్నా అందరికీ వైద్యాన్ని అందించలేని పరిస్థితులు ఉన్నట్లు చెప్పారు.హతరు ప్రావిన్స్‌లో నిరాశ్రయులైన వేలాది మందికి స్పోర్ట్స్‌ సెంటర్లలో, హాళ్లలో ఆశ్రయం పొందినట్లు చెప్పారు. చలి తీవ్రంగా ఉండటంతో పరిస్థితి మరింత దయనీయంగా ఉన్నదన్నారు. వైద్య సాయం అవసరమైన వారిని దగ్గరలోని మెర్సిన్‌ నగరానికి తరలించేందుకు ఆసుపత్రి కూలిపోయిన ఇస్‌కెండెరన్‌ ప్రావిన్స్‌ పోర్టుకు నేవీ నౌక మంగళవారం చేరుకున్నది. భూకంకం కారణంగా కంటెయినర్లు దొర్లి పడిన క్రమంలో భారీగా మంటలు ఎగిసిపడగా వాటిని అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.
ప్రపంచ దేశాల ఆపన్నహస్తం: టర్కీ, సిరియా దేశాలకు తమ వంతు సహాయ సహకారాలు అందజేసేందుకు ప్రపంచ దేశాలు ముందుకొచ్చాయి. టర్కీ, ఉత్తర సిరియాకు సహాయ సహకారాలు అందించేందుకు కట్టుబడి ఉన్నామంటూ ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. విపత్తు బాధితులైన వేలాది కుటుంబాలకు అంతర్జాతీయ సమాజం అండగా నిలుస్తుందని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్‌ అన్నారు. మానవతా సాయానికి పిలుపునిచ్చారు. ప్రపంచ శక్తులు వెంటనే స్పందించి సహాయక బృందాలు, వైద్య సామ్రాగిని టర్కీ, సిరియాకు పంపాయి. అమెరికా, చైనా, భారత్‌, బ్రిటన్‌, రష్యా, కొరియా, ఇటలీ, స్పెయిన్‌, స్లోవేకియా తదితర దేశాల నుంచి టర్కీ, సిరియాకు సాయం అందింది. బల్గేరియా, క్రొయేషియా, చెచియా, ఫ్రాన్స్‌, గ్రీస్‌, హంగేరి, మాల్టా, నెథర్లాండ్స్‌, పోలాండ్‌, రొమేనియా నుంచి సహాయక సిబ్బందిని పంపినట్లు యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) ప్రకటించింది. తమ దేశం నుంచి 60 మందితో కూడిన సహాయక బృందంతో పాటు 50 మంది సైనికులు, వైద్య పరికరాలు, మందులు పంపినట్లు దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యూల్‌ ప్రకటించారు. పాకిస్తాన్‌ 40 మందితో రెస్క్‌రెస్క్యూ బృందాన్ని, సహాయ సామాగ్రినీ మంగళవారం తెల్లవారుజామున పంపింది. బుధవారం నుంచి సిరియా, టర్కీకు సహాయ విమానాలు రోజూ రాకపోకలు సాగిస్తాయని తెలిపింది. భారతదేశం రెండు రెస్క్‌ బృందాలు, ప్రత్యేక శిక్షణ పొందిన జాగిలాలు, వైద్య సిబ్బందితో పాటు సైన్యాన్ని ఆ రెండు దేశాలకు పంపింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌... ఎర్దోగన్‌కు ఫోన్‌ చేసి సంఫీుభావం తెలిపారు. అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీనిచ్చారు. టర్కీకి సర్చ్‌రెస్క్యూ బృందాలు పంపినట్లు శ్వేతసౌధం ప్రకటించింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ బాధిత దేశాల అధ్యక్షులకు ఫోన్‌ చేసి సంఫీుభావం తెలిపారు. తమ వంతు సహాయం చేస్తామన్నారు. ఈ గడ్డుపరిస్థితుల్లో ధైర్యంగా ఉండాలంటూ ధైర్యం చెప్పారు. ఈ విపత్తుకర పరిస్థితులను టర్కీ, సిరియా అధిగమించగలవని జిన్‌పింగ్‌ ఆకాంక్షించారు. బ్రిటన్‌ నుంచి 76 సెర్చ్‌`రెస్క్యూ నిపుణులు, నాలుగు జాగిలాలు, ఇతరత్రా అవసరమైన పరికరాలు పంపినట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి జేమ్స్‌ క్లెవర్లీ ఓ ప్రకటనలో తెలిపారు. మరింత సాయం చేసేందుకూ సిద్ధమన్నారు. ఇజ్రాయిల్‌ కూడా సాయం చేసేందుకు సానుకూలత వ్యక్తంచేసింది.
మీకు మేమున్నాం…: కమ్యూనిస్టు పార్టీలు
‘మీరు ఒంటరిగా లేరు. మీ వెంట మేమున్నాం’ అంటూ టర్కీ, సిరియా ప్రజలకు కమ్యూనిస్టు పార్టీలు భరోసా నిచ్చాయి. తమ వంతు సహాయక సహకారాలు అందించాయి. సాయం కోసం పిలపునిచ్చాయి. ఈ మేరకు ప్రకటనలను టర్కీ కమ్యూనిస్టు పార్టీ (టీకేపీ), సిరియా కమ్యూనిస్టు పార్టీ (కేఎన్‌ఈ) వెలువరించాయి. సహాయ, పునరావాస చర్యల్లో కలిసి రావాలని, టెలికమ్యూనికేషన్‌తో పాటు రవాణా వ్యవస్థ స్తంభించినందున చేతనైన సాయం చేయాలని విన్నవించాయి. సాయం కోరుతూ పోస్టర్‌నూ విడుదల చేశాయి. గ్రీస్‌ కమ్యూనిస్టు పార్టీ (కేకేఈ), ఆల్‌ వర్కర్స్‌ మిలిటెంట్‌ ఫ్రంట్‌ (పీఏఎంఈ) సంఫీుభావాన్ని ప్రకటించాయి. టర్కీ, సిరియా, లెబనాన్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో భూకంప బాధితులకు టర్కీ, సిరియా, గ్రీస్‌ కార్మిక సంఘాలు అండగా నిలిచాయి. భూకపం బాధితులకు గ్రీస్‌లోని ప్రాంతీయ కార్మిక సంఘాల కేంద్రాలు, సమాఖ్యలు, కార్మిక సంఘాలు అండగా ఉంటాయని కేకేఈ పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img