Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

మా క్షిపణుల్ని కూల్చారో…

. అమెరికా, దక్షిణ కొరియాకు ఉ.కొరియా హెచ్చరిక
. సంయుక్త విన్యాసాలపై ఆగ్రహం

సియోల్‌: అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలపై ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ సోదరి కిమ్‌ యో జోంగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము పరీక్షించే క్షిపణులను కూల్చివేస్తే, అది ఉత్తర కొరియాపై యుద్ధం ప్రకటించినట్టుగా భావిస్తామని అమెరికా, దక్షిణ కొరియా దేశాలకు తేల్చిచెప్పారు. ఉత్తర కొరియా వ్యూహాత్మకంగా క్షిపణి పరీక్షలు చేపడుతోందని, అందుకు వ్యతిరేకంగా అమెరికా చేపట్టే ఎలాంటి సైనిక చర్యనైనా యుద్ధ ప్రకటనగానే పరిగణిస్తామని, అందుకు తీవ్ర పరిణామాలు తప్పబోవని హెచ్చరించారు. తమను తక్కువగా అంచనా వేయొద్దనిని సూచించారు. పసిఫిక్‌ మహాసముద్రంలోకి బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించే సత్తా ఉత్తర కొరియాకు ఉందన్నారు. ఈ మేరకు ఉత్తర కొరియా అధికారిక మీడియా సంస్థ కేసీఎన్‌ఏ పేర్కొంది. అమెరికా-దక్షిణ కొరియా సైనిక విన్యాసాలపై ఉత్తర కొరియా విదేశాంగ శాఖకు చెందిన విదేశీ వార్తల విభాగం చీఫ్‌ సోమవారం ప్రత్యేకంగా మరో ప్రకటన చేశారు. బీ`52 బాంబర్‌తో సంయుక్త ఎయిర్‌ డ్రిల్‌ నిర్వహించడం ద్వారా పరిస్థితిని అమెరికా మరింత ఉద్రిక్తంగా మార్చింది ఆరోపించారు. అమెరికా బీ52బాంబర్‌ను విన్యాసాల కోసం మోహరించడం దీనిని ఉత్తర కొరియా అణు, క్షిపణి బెదరింపులకు వ్యతిరేకంగా జరుగుతోన్న బలప్రదర్శనగా దక్షిణ కొరియా వ్యాఖ్యానించింది. ఇరు దేశాలూ వచ్చే వారం ‘ఫ్రీడమ్‌ షీల్డ్‌’ డ్రిల్‌ పేరుతో 10 రోజుల పాటు సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించనున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img