Friday, April 19, 2024
Friday, April 19, 2024

మా గగనతలంలోకి 10కి పైగా అమెరికా బెలూన్లు: చైనా

బీజింగ్‌: అమెరికా సైన్యం తమ బెలూన్‌ను గగనతలంలో పేల్చివేయడంపై చైనా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. పౌరసేవల కోసం తాము నింగిలోకి పంపిన బెలూన్‌ను నిఘా బెలూన్‌ పేరుతో ఆమెరికా కూల్చివేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా బెలూన్‌లు పదిసార్లకు పైగా తమ గగతతలంలోకి ప్రవేశించాయని తెలిపింది. చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ సోమవారం మీడియాతో మాట్లాడుతూ… అక్రమంగా ఇతర దేశాల గగనతలాల్లోకి ప్రవేశించడం అమెరికాకు సర్వసాధారణమేనని ఆయన విమర్శించారు. గత ఏడాది జనవరి నుంచి ఆమెరికాకు చెందిన 10కి పైగా బెలూన్‌లు చైనా అధికారుల అనుమతి లేకుండా అక్రమంగా తమ గగనతంలో ఎగిరాయని తెలిపారు. ఆ చొరబాట్లపై చైనా ఎలా స్పందిస్తుందన్న ప్రశ్నకు వాంగ్‌ సమాధానమిస్తూ… బీజింగ్‌ వ్యవహరించిన తీరు బాధ్యతాయుతంగా, ప్రొఫెషనల్‌గా ఉందన్నారు. ‘‘చైనా గగనతలంలోకి అక్రమంగా ప్రవేశించిన అమె రికా హై ఆల్టిట్యూడ్‌ బెలూన్ల గురించి మీరు మరింత తెలుసుకోవాలనుకుంటే, మీరు అమెరికాను ప్రశ్నిం చాలని నేను సూచిస్తున్నాను’’ అని ఆయన వెల్లడిర చారు. ఫిబ్రవరి 4న చైనా నిఘా బెలూన్‌ను కూల్చిన ఘటనపై ఎట్టకేలకు బీజింగ్‌ తో సంప్రదింపులు జరిపినట్లు అమెరికా అధికారులు పేర్కొన్న కొద్దిసేపటికే చైనా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ విషయంపై కమ్యూనికేట్‌ చేయడానికి పెంటగాన్‌ (అమెరికా డిఫెన్స్‌ డిపార్ట్‌ మెంట్‌) చేసిన ప్రయత్నాలు రోజుల తరబడి విఫలమయ్యాయని రక్షణ అధికారి రైడర్‌ చెప్పారు.
మరో ఎగిరే వస్తువును కూల్చేసిన అమెరికా
అమెరికా-కెనడా సరిహద్దులోని మిచిగాన్‌ ఎగువ ద్వీపకల్పం, హురాన్‌ సరస్సు గగనతలంపై ఎగురుతున్న వస్తువును అమెరికా కూల్చివేసింది. గత వారం రోజుల్లో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం నాలుగోసారి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img