Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మా జోలికొస్తే ఖబడ్దార్‌.. చైనాకు బైడెన్‌ హెచ్చరిక

పొరపాటున వచ్చిన బెలూన్‌ ను కూల్చేయడమేంటని మండిపడ్డ చైనా
ఈ విషయంపై ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం

అమెరికా సార్వభౌమత్వానికి ముప్పు కలిగించేలా ప్రవర్తిస్తే ఊరుకోబోమని ఆ దేశ ప్రెసిడెంట్‌ జో బైడెన్‌ తేల్చిచెప్పారు. చైనాకు చెందిన బెలూన్‌ అమెరికా గగనతలంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. ఈ బెలూన్‌ ను అమెరికా కూల్చేయడంపై చైనా నిరసన వ్యక్తం చేసింది. పొరపాటుగా అమెరికా గగనతలంలోకి ప్రవేశించిన బెలూన్‌ ను కూల్చేయడం సరికాదని విమర్శించింది. ఈ విషయంపై ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.ఈ సందర్భంగా చైనాకు అమెరికా ప్రెసిడెంట్‌ బైడెన్‌ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. తమ జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. ఈమేరకు బుదవారం స్టేట్‌ ఆఫ్‌ యూనియన్‌ లో బైడెన్‌ ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా పలు సవాళ్లను ఎదుర్కొంటున్నామని వ్యాఖ్యానించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ను కూడా బైడెన్‌ ఈ సందర్బంగా విమర్శించారు. ఉక్రెయిన్‌ రష్యా యుద్ధం యుగయుగాలకూ పరీక్ష అని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img