Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ముందు తాలిబన్లకు అడ్డుకట్ట వేయండి

అఫ్గనిస్థాన్‌ సైన్యానికి అమెరికా సూచన

అలాస్కా : తాలిబన్ల నుంచి తమ దేశాన్ని కాపాడుకోవాలని అఫ్గనిస్థాన్‌ సైన్యానికి అమెరికా హితవు పలికింది. ముందు తాలిబన్ల జోరును తగ్గించాలని సూచించింది. ఇప్పటికే అనేక కీలక నగరాలపై తాలిబన్ల నిఘా ఉండటంతో ఆప్ఘన్‌ సైన్యం వ్యూహాత్మకంగా అడ్టుకట్ట వేయాలని అమెరికా రక్షణ కార్యదర్శి లాయిడ్‌ ఆస్టిన్‌ అన్నారు. కాబుల్‌ తదితర నగరాల చుట్టూ అఫ్గనిస్థాన్‌ దళాలు మోహరించి, తాలిబన్ల కట్టడి చేయాలని, సొంత భూభాగాన్ని వారి స్వాధీనంలోకి వెళ్లనివ్వొద్దని సూచించారు. సరిహద్దుల వద్ద యుద్ధవ్యూహంతో అఫ్గాన్‌ సైన్యం సిద్ధంగా ఉన్నట్లు రాయిటర్స్‌ నివేదిక కూడా పేర్కొంది. ‘కీలక నగరాలను సైన్యం ముట్టడిస్తోంది. ఇది తాలిబాన్లను ఆపగలదో లేదో తెలియదుగానీ వారి గతిని తగ్గించడంపైనే ఆప్ఘన్‌ సైన్యం ప్రధానంగా దృష్టి పెట్టాలి’ అని అలాస్కాలో పర్యటనలో భాగంగా అక్కడ విలేకరులతో మాట్లాడిన ఆస్టిన్‌ అన్నారు. తాలిబన్ల కన్నా తామే శక్తిమంతులమని ఆఫ్ఘన్‌ నిరూపించుకోవాలన్నారు. ఆగస్టు 31 నాటికి ఆప్ఘనిస్థాన్‌ మిషన్‌ను ముగిస్తామని, అమెరికా సైన్యాన్ని పూర్తిగా ఉపసంహరిస్తామని, ఇప్పటికే 95శాతం సైన్యం వైదొలగినట్లు తెలిపారు. తాలిబన్లకు అడ్డుకట్ట వేసి, పురోగతి సాధించే సత్తా అఫ్గాన్లకు ఉందని ఆస్టిస్‌ అన్నారు. ఇప్పటికే ప్రావిన్షియల్‌ రాజధానులపై తాలిబన్ల కన్ను ఉందని, అఫ్గాన్‌కు అమెరికా మద్దతు ఉంటుందని చెప్పారు. కాబూల్‌లోని దళాలకు ఆర్థిక సహాయంÑ ఆ దేశంలో శరణార్ధుల కోసం అత్యవనర నిధిగా 100 మిలియన్‌ డాలర్ల సాయాన్ని బైడెన్‌ అందిస్తున్నట్టు వెల్లడిరచారు. అఫ్గాన్‌ స్పెషల్‌ ఇమ్మిగ్రేషన్‌ వీసా అర్జీదారులకూ ఇది వర్తిస్తుందన్నారు. ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి బలగాలను అమెరికా వెనక్కి రప్పించడంతో తాలిబన్లు మరింత రెచ్చిపోతున్నారు. దాడులకు పాల్పడి సుమారు 90 శాతం సరిహద్దు ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. దీంతో ఆఫ్ఘనిస్థాన్‌లో మరోసారి తాలిబన్ల పాలన రావచ్చని అంతా భావిస్తున్నారు. అయితే తాలిబన్లకు పాకిస్థాన్‌ అండదండలు ఉన్నాయని, వారికి ఆ దేశం స్వర్గదామంగా మారిందని ఆప్ఘనిస్థాన్‌ అధికారులు ఆరోపిస్తున్నారు.
31 ప్రావిన్సుల్లో నైట్‌ కర్ఫ్యూ
తాలిబన్‌లను అడ్డుకునే యత్నంలో భాగంగా 31 ప్రావిన్సుల్లో నైట్‌ కర్ఫ్యూను ఆప్ఘన్‌ అధికారులు విధించారు. రాత్రి 10 నుంచి ఉదయం 4 గంటల వరకు ప్రజలు తమ ఇళ్ల గడప దాటేందుకు వీల్లేదని పేర్కొన్నారు. కాబూల్‌, తూర్పు నంగర్‌హార్‌ ప్రావిన్స్‌, ఉత్తర పంజ్‌షెర్‌ ప్రావిన్సులకు మినహాయింపు ఉంటుందని అప్ఘన్‌ అంతర్గత వ్యవహారాల శాఖ పేర్కొంది. ఉగ్ర కార్యకలాపాలు రాత్రిళ్లు జరుగుతుంటాయని, వాటిని కట్టడి చేయడం కోసమే ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడిరచింది. నైట్‌ కర్ఫ్యూను పాటిస్తూ సైన్యానికి పూర్తిగా సహకరించాలని ప్రజలకు సూచించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img