Friday, April 19, 2024
Friday, April 19, 2024

మూడవసారి సీపీసీ ప్రధాన కార్యదర్శిగా
జిన్‌పింగ్‌ ఎన్నికకు రంగం సిద్ధం

బీజింగ్‌ : ఈ వారాంతంతో ముగియనున్న చైనా కమ్యూనిస్టు పార్టీ 20వ మహాసభలలో దేశంలోనే అత్యంత శక్తివంతమైన పాలక కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా మూడవసారి ఐదేళ్లకాలం పాటు చైనా అధ్యక్షుడు గ్జిజిన్‌పింగ్‌ విజయం సాధించేందుకు రంగం సిద్ధమైంది. ప్రతి ఐదేళ్లకొకసారి దాదాపు 2,300మంది ప్రతినిధులతో జరిగే పార్టీ మహాసభలు గత ఆదివారం బీజింగ్‌లోని తియానన్‌మెన్‌ స్క్వేర్‌లో గల విశాలమైన గ్రేట్‌హాల్‌ ఆఫ్‌ పీపుల్‌లో ప్రారంభమయ్యాయి. మహాసభ కార్యకలాపాలు జనాంతికంగా జరిగాయి.
పార్టీ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ కేంద్ర సైనిక కమిషన్‌ ఛైర్మన్‌గా గతంలో ఎన్నడూ లేని విధంగా మూడవసారి జిన్‌పింగ్‌ మూడవసారి ఎన్నికవుతారని విస్తృతంగా భావిస్తున్నారు. ఈ రెండు పదవులు పార్టీ, సైన్యంపై నియంత్రణను ఆయనకు దఖలుపరుస్తాయి. పదవీ కాల పరిమితి తొలగిస్తూ 2018లో రాజ్యాంగాన్ని సవరించిన తరువాత వచ్చే మార్చిలో జరుగనున్న వార్షిక పార్లమెంటరీ సమావేశంలో మూడవసారి దేశాధ్యక్ష పదవికి జిన్‌పింగ్‌ ఎన్నిక కాగలరని భావిస్తున్నారు. చైనా దేశాధినేతగా లాంఛనప్రాయమైన అధ్యక్ష పదవిలో జిన్‌పింగ్‌ ఇతర దేశాలలో పర్యటించి ప్రపంచ నేతలతో చర్చలు జరుపవచ్చు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img