Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

మూడోసారి అధ్యక్షుడిగా జిన్‌పింగ్‌

ప్రారంభమైన సీపీసీ ఆరవ ప్లీనరీ

బీజింగ్‌: చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) 19వ కేంద్ర కమిటీ ఆరవ ప్లీనరీ సమావేశం సోమవారం బీజింగ్‌లో ప్రారంభమైంది. సీపీసీ సెంట్రల్‌ కమిటీ ప్రధాన కార్యదర్శి, దేశాధ్యక్షుడు క్సి జిన్‌పింగ్‌ సెంట్రల్‌ కమిటీ పొలిటికల్‌ బ్యూరో తరఫున నివేదికను అందించారు. సెంట్రల్‌ కమిటీ తీర్మానం సీపీసీ చరిత్రలో మూడవది. మొదటిది 1945లో మావో ఆధ్వర్యంలో ఆమోదించగా రెండవది 1981లో జియావోపింగ్‌ ఆధ్వర్యంలో సాంస్కృతిక విప్లవం కోసం చారిత్రక తీర్మానాలను తీసుకొచ్చారు. ఆ తర్వాత ప్రవేశ పెట్టనున్న మూడవ తీర్మానం ఇదేకానుంది. జిన్‌పింగ్‌ రాజకీయ స్థానాన్ని మరింత సుస్థిరపరచేలా ఈ తీర్మానం ఉంటుందని రాజకీయ విశ్లేషకుడు వాంగ్‌ పేర్కొన్నారు.
జిన్‌పింగ్‌కు మూడోసారి అధ్యక్షపగ్గాలు :
చైనా 2018లో అధ్యక్ష పదవికి సంబంధించిన కాల పరిమితులను తొలగించి జిన్‌పింగ్‌ను జీవితాంతం అధికారంలో కొనసాగించే అవకాశం కల్పించింది. ఈ నేపధ్యంలో జిన్‌పింగ్‌కు దేశాధ్యక్షుడిగా మూడోసారి అధికార పగ్గాలు చేపట్టే ‘చారిత్రక తీర్మానం’ ఈ సమావేశంలో ఆమోదం పొందనుంది.వచ్చేఏడాది జరగనున్న చైనా జాతీయ కాంగ్రెస్‌ నూతన అధ్యక్షుడిను ఎన్నుకోనున్న తరుణంలో రాజకీయంగా ఈ సమావేశం కీలకమైందని చెప్పవచ్చు. పార్టీ తీసుకునే కీలక నిర్ణయాలను సమావేశాల చివరి రోజున ప్రకటించే అవకాశం ఉంది. మావో తర్వాత జిన్‌పింగ్‌ అత్యంత శక్తివంతమైన నాయకుడుగా ఎదిగారు.
సీపీసీ సాధించిన విజయాలు:
సీపీసీ 100 సంవత్సరాల్లో సాధించిన విజయాలు, చారిక్రత అనుభవంపై అధ్యక్షడు జిన్‌పింగ్‌ ముసాయిదా తీర్మానం విడుదల చేశారని జిన్హువా న్యూస్‌ ఏజన్సీ తెలిపింది. ఈ సమావేశంలో 400 మంది సభ్యులు ప్లీనరీలో పాల్గొన్నారు. సెంట్రల్‌ కమిటీలోని దాదాపు 200 మంది సభ్యులతో ఈ సమావేశం గురువారం వరకు కొనసాగుతుంది. మావన అభివృద్ధి చరిత్రలో 100 సంవత్సరాలలో సీపీసీ విశేషమైన విజయాలు సాధించిందని దేశంలోని అన్ని జాతులకు నమానంగా నాయకత్వం వహించిందని పేర్కొన్నారు. విదేశీ ఆధిపత్యం నుంచి చైనా ఆవిర్భావం, ఆర్థికంగా ఎదగడం, ప్రపంచ శక్తిగా ఆవిర్భవించడం వంటి అంశాలను ఈ నివేదికలో జిన్‌పింగ్‌ పేర్కొన్నారు. అణచివేత, బెదిరింపులకు ఎదుర్కొంటున్న చైనా అన్ని రంగాల్లో ఆధునీకరణ దిశగా ముందుకు సాగుతోందని ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనాలో సోషలిజం విజయవంతంగా సాగుతోందని ఈ ప్రకటన పేర్కొంది. చైనా కాలానికి అనుగుణంగా అడుగులు వేస్తోందని, చైనా జాతీయ పునరుజ్జీవనంలో ప్రధాన శక్తిగా ఎదుగుతోందని పేర్కొంది. చైనా కమ్యూనిస్టులు, మావో జెడాంగ్‌, డెంగ్‌ జియావోపింగ్‌, జియాంగ్‌ జెమిన్‌, హు జింటావో ముఖ్య ప్రతినిధులుగా, విషేషమైన అనుభవంతో విప్లవం, నిర్మాణం, సంస్కరణలో కీలకమైన పురోగతిని సాధించడంలో మొత్తం పార్టీని, అన్ని జాతుల ప్రజలను నడిపించారని పేర్కొంది. చైనా లక్షణాలతో కూడిన సోషలిజం బలమైన శక్తిగా రూపొందింది. చైనా తన అంతర్జాతీయ హోదాను మరింత సుస్థిరం చేసుకుంది. ఈ అంశాలన్నీ బలమైన పునాదులతో జాతీయ పునరుజ్జీవనానికి పేరణనిచ్చాయని ఈ ప్రకటన పేర్కొంది. పట్టుదలతో కూడిన పోరాటం ద్వారా, చైనా అభివృద్ధి చెందడం నుండి బలమైన శక్తిగా మారింది. అద్భుÛతమైన పరివర్తనను సాధించిందని, చైనా జాతీయ పునరుజ్జీవనం చారిత్రక అనివార్యంగా మారిందని పార్టీ, చైనా ప్రజలు ప్రపంచానికి చూపించారని ఈ ప్రకటన పేర్కొంది. పార్టీ తీర్మానాన్ని రూపొందించడంలో, పార్టీ లోపల, వెలుపల నుండి అభిప్రాయాలు, సూచనలను సేకరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img