Friday, April 19, 2024
Friday, April 19, 2024

మేమొస్తేనే మార్పొస్తుంది!

టర్కీ కమ్యూనిస్టు పార్టీ
పార్లమెంటరీ ఎన్నికల ప్రచారం ప్రారంభం

అంకార: ‘టీకేపీ వస్తే మార్పు వస్తుంది!’ అన్న నినాదంతో టర్కీ కమ్యూనిస్టు పార్టీ (టీకేపీ) త్వరలో జరగబోయే పార్లమెంటరీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. సమసమాజ స్థాపనతో పాటు లౌకిక, స్వతంత్య్ర, ఆధునిక, పారిశ్రామికీకరణతో కూడిన టర్కీ నిర్మాణానికి కట్టుబడి ఉన్నట్లు తాజా ప్రకటనలో పార్టీ కేంద్ర కమిటీ ప్రకటించింది. 1923 పోరాట స్ఫూర్తితో 2023 పార్లమెంటరీ ఎన్నికలకు నడుం బిగించినట్లు పేర్కొంది. నాటి తరహాలోనే నేటి అనైతిక ప్రభుత్వాన్ని గద్దెదించుదామని టర్కీ ప్రజలకు పిలుపునిచ్చింది. టర్కీ కమ్యూనిస్టు పార్టీకి ఓట్లు వేయాలని కోరింది. టర్కీ కమ్యూనిస్టు పార్టీ వస్తే అన్ని మారిపోతాయని నొక్కిచెప్పింది. తమ పోరాటానికి సంఫీుభావం ప్రకటించడమే కాకుండా కలిసి రావాలంటూ పిలుపునిచ్చింది. టర్కీ కమ్యూనిస్టు పార్టీకి ఓటు వేయడం ద్వారా సమసమాజ స్థాపనకు ముందడుగు పడుతుందని పేర్కొంది. టర్కీ కమ్యూనిస్టు పార్టీ రాకతో ప్రతీది మారిపోతుందని నమ్మాలని, ఈ విషయాన్ని మరువద్దని టర్కీ ప్రజలకు సూచించింది. ‘లౌకిక, స్వతంత్ర, ఆధునిక, పారిశ్రామిక టర్కీ నిర్మాణమే ఆకాంక్షిస్తున్నాం. అప్పుడే ప్రజలకు నిజమైన స్వాతంత్య్రం లభిస్తుంది. అసమానత్వం, వివక్షకు చెక్‌ పెట్టొచ్చు. అంతకంటే ముందు నిసిగ్గు కేపటలిస్టులు, అంతర్జాతీయ కార్పొరేట్లు పెత్తనాన్ని అంతమొందిస్తాం. వారి నిజస్వరూపాన్ని, అబద్ధాల వెనుక వాస్తవాలను బహిర్గతం చేస్తాం’ అని టర్కీ కమ్యూనిస్టు పార్టీ పిలుపునిచ్చింది. టర్కీలోని ఏకేపీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టింది. పేదరికం, అవినీతి నిర్మూలన అంటూ అధికారంలోకి వచ్చి అనైతిక పరిపాలన సాగిస్తోందని విమర్శించింది. అసమానత్వం రాజ్యమేలుతుంటే నైతికత గురించి మాట్లాడే ధైర్యం ఎక్కడిది? అని ప్రశ్నించింది. పెట్టుబడిదారీవర్గం కార్మికశక్తిని దోచేస్తోందని, పేదలు మరింత పేదలవుతుంటే.. ఆకలి కేకలు మిన్నంటున్నాయని ఆవేదన వ్యక్తంచేసింది. ఇటువంటి పరిస్థితులకు దారితీస్తున్న వారు అనైతికులని, 1923 తరహాలో వారిని బుద్ధిచెబుదామంటూ టర్కీ ప్రజలకు టీకేపీ పిలుపునిచ్చింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img