Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

యెమన్‌లో తొక్కిసలాట – 85 మంది మృతి

ఆర్థిక సాయం పంపిణీ వేళ విషాదం
సనా: రంజాన్‌ సందర్భంగా యెమన్‌లో ఓ స్వచ్చంధ సంస్థ చేపట్టిన కార్యక్రమం విషాదాన్ని మిగిల్చింది. ఆర్థిక సాయం పంపిణీకి జనం వందలాది మంది ఎగబడిన క్రమంలో అక్కడ తొక్కిసలాట జరిగింది. 85 మంది చనిపోగా 322 మంది గాయపడ్డారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. రాజధాని సనాలోని ఓ పాఠశాలలో కొందరు వ్యాపారులు స్వచ్చందంగా ఆర్థిక సాయం చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనకు బాధ్యులైన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడిరచారు. కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరగవచ్చన్నారు. యెమన్‌లో ఎనిమిదేళ్లకు పైగా జరిగిన అంతర్యుద్ధం ప్రపంచంలోని అత్యంత ఘోరమైన మానవతా విషాదాలలో ఒకటిగా ఐక్యరాజ్యసమితి అభివర్ణించింది. అక్కడి జనాభాలో మూడిరట రెండు వంతుల కంటే ఎక్కువ మంది దారిద్య్ర రేఖకు దిగువన నివసిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img