Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

రక్షణకోసం అఫ్గాన్ల దీనాలాపన

కాబూల్‌ : అఫ్గాన్ల దీనావస్థ కలచివేస్తోంది. వందలాదిమంది మోకాలిలోతు డ్రైనేజి నీటిలో నిలబడి తమచేతుల్లోని పత్రాలను పైకి ఎత్తిచూపిస్తూ తమను విమానాశ్రయంలోకి అనుమతించాలని అమెరికన్‌ దళాలను కోరుతున్నారు. దీనికి సంబం ధించిన వీడియోలు వారి దురవస్థను కళ్లకు కడుతు న్నాయి. తక్కువ సంఖ్యలో ఉన్న అమెరికన్‌, బ్రిటన్‌ దళాలు వెళ్లిపోతే తమకు దిక్కెవరని అఫ్గాన్లు ప్రశ్నిస్తు న్నారు. విమానాశ్రయాలకు అప్గాన్లు వెళ్లకుండా తాలిబన్లు అడ్డుకుంటున్నారు. అఫ్గాన్లను ఇళ్లకు వెళ్లి పోవలసిందిగా తాలిబన్లు ఆదేశించడం కనిపిస్తోంది.
నిధులు నిలిపివేసిన ప్రపంచ బ్యాంకు
అఫ్గాన్‌లోని పరిస్థితిపై ముఖ్యంగా మహిళల హక్కులపై ఆందోళన చెందుతున్నామని ప్రపంచ బ్యాంకు తెలిపింది. ఆఫ్గాన్‌కు ఇక సాయం చెయ్యలేమని స్పష్టం చేసింది. అనేక దేశాలతోనూ, భాగస్వాములతో కూడా సంప్రదింపులు జరుపుతున్నామని అఫ్గాన్‌ ప్రజలకు తమ మద్దతు ఉంటుందని తెలిపింది. ఆఫ్గాన్‌ అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు రెండు డజన్ల ప్రాజెక్టులు చేపట్టింది. 2002 నంచి 5.3 బిలియన్‌ డాలర్లను ఈ దేశ ప్రగతికి ఖర్చుచేసింది. ఈ నిధుల్లో చాలావరకు గ్రాంట్ల రూపంలో లభించింది. గత శుక్రవారం నాటికే కాబూల్‌ నుంచి తమ సిబ్బందిని వరల్డ్‌ బ్యాంకు తరలించింది. ఐఎంఎఫ్‌ కూడా తన నిధులను ఆపివేసినట్లు పేర్కొంది. ఆఫ్గాన్‌ సెంట్రల్‌ బ్యాంకులోని 9.4 బిలియన్‌ డాలర్ల నిధులను అమెరికా నిలిపివేసింది. అఫ్గాన్‌ నుంచి తమ దళాల తరలింపు ప్రక్రియ ఈనెల 31తో ముగుస్తుందని బ్రిటన్‌ వెల్లడిరచింది. ఈనెలాఖరు నాటికి తమ బలగాల ఉపసంహరణ పూర్తవుతుందని తెలిపింది. ఉన్న సమయాన్నే సమర్థంగా వినియోగించుకుంటామన్నారు.
అఫ్గాన్‌ మంత్రి పిజ్జా డెలివరీ బాయ్‌గా
అఫ్గాన్‌లో పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. సాధారణ ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. పొరుగు దేశాలకు తరలి వెళ్లేందకు ప్రయత్నాలు మరింత ముమ్మరం చేస్తున్నారు. ఆ దేశ రాజకీయ నాయకులు, ప్రముఖులు కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తాజాగా అఫ్గాన్‌ మాజీ ఐటీ శాఖ మంత్రి సయ్యద్‌ షాసాదత్‌ పిజ్జా డెలివరీ బాయ్‌గా ఇంటింటికీ వెళ్లి పిజ్జాలు అందిస్తున్నారు. స్వదేశంలో ఐటీ అభివృద్ధిపై దృష్టి సారించిన సాదత్‌ జర్మనీలో పిజ్జాలు అందిస్తు న్నారు. జర్మనీలోని లీప్‌జిగ్‌ పట్టణంలో సైకిల్‌పై డెలివరీ చేస్తున్నారు. ఐటీ శాఖ మంత్రిగా సాదత్‌ మొబైల్‌ నెట్‌వర్కింగ్‌అభివృద్ధి చేశారు. తాలిబన్లు దేశాన్ని ఆక్రమించే వారం ముందు జర్మనీకి వచ్చేశారు. కుటుంబ పోషణకోసం విధిలేక డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నానని తెలిపారు. అష్రఫ్‌ ఘనీతో మనస్పర్థలు చోటుచేసుకోవడంతో మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు సాదత్‌ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img