Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

రష్యా అమ్ములపొదిలో ‘బెల్గొరోడ్‌’

మాస్కో: ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగుతున్న సమయంలో రష్యా అత్యంత శక్తిమంతమైన జలాంతర్గామిని నావికాదళంలో ప్రవేశపెట్టింది. ఈ ఆయుధం సముద్రంలోని అత్యంత లోతుల్లో రహస్యంగా ఉందగలదు. అదే ‘కే-329 బెల్గొరోడ్‌’. అణ్వాయుధాలతో కూడిన అండర్‌ వాటర్‌ డ్రోన్లను వేల మైళ్ల దూరానికి మోసుకెళ్లడం ఈ సబ్‌మెరైన్‌ ప్రత్యేకత. ప్రపంచంలో ఇప్పటివరకూ ఇదే అత్యంత బరువైన. పొడవైన సబ్‌మెరైన్‌. ఈ జలాంతర్గామిలో మొత్తం ఆరు పొసెయిడన్‌ న్యూక్లియర్‌ ఆర్మ్‌డ్‌ టోర్పెడోలు ఉన్నాయి. శత్రు దేశ తీరాన్ని లక్ష్యంగా చేసుకొని ఈ జలాంతర్గామి నుంచి ఒక్క టోర్పెడోను ప్రయోగిస్తే.. శత్రు దేశ తీరమంతా రేడియో ధార్మికతతో నిండిపోతుంది. దీంతో శత్రు దేశంలో అపార ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుంది. 2027నాటికి ఇలాంటివే మరో రెండు జలాంతర్గాములను తీసుకురావడానికి రష్యా ప్రయత్నిస్తున్నది. ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగుతున్న ఈ సమయంలో రష్యా ఈ తరహా సబ్‌మెరైన్‌ను ప్రయోగిస్తే.. రేడియోధార్మిక సునామీనే అని రక్షణ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 24వేల టన్నుల బరువు, 604 అడుగుల పొడవు, గంటకు 59కిలోమీటర్ల వేగంతో ఉన్న ఈ జలాంతర్గామి ప్రపంచంలోనే భారీ ఆయుధం. సముద్రంలో అత్యంత లోతుల్లో ఉండే కేబుల్స్‌న ధ్వంసం చేసేందుకు దీనిని వినియోగిస్తారు. ఈ సబ్‌మెరైన్‌ సైంటిఫిక్‌ రీసెర్చిలకు, లోతైన ప్రదేశాల్లో రెస్క్యూ ఆపరేషన్‌కు తోడ్పడుతుంది. ఈ ఆయుధాన్ని రష్యా ప్రతిదాడికి మాత్రమే వినియోగిస్తుంది. దీనిని తీర ప్రాంతాల్లో నగరాలు, పారిశ్రామిక ప్రాంతాలు, సముద్రంలోని క్యారియర్‌ బ్యాటిల్‌ గ్రూప్‌లను లక్ష్యంగా చేసుకుని ప్రయెగిస్తారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img