Friday, April 26, 2024
Friday, April 26, 2024

రష్యా యూనివర్సిటీలో కాల్పులు..

8 మంది మృతి
రష్యాలో పెర్మ్‌ క్రాయ్‌లోని పెర్మ్‌స్టేట్‌ యూనివర్సిటీలో గుర్తు తెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో 8 మంది మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. ఇంకా ఎక్కువ సంఖ్యలో మరణాలు సంభవించి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. కాల్పులకు భయపడిన కొందరు విద్యార్ధులు యూనివర్సిటీ ఆడిటోరియంలో దాక్కున్నారు. మరికొందరు కిటికీల ద్వారా తప్పించుకునేందుకు యత్నిస్తూ భవనంపై నుంచి దూకేశారు. అనేక మంది విద్యార్ధులు భయంతో పారిపోతున్న దృశ్యాలు ఆన్‌లైన్‌లో వైరల్‌ అయ్యాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img