Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

రెడ్‌ ఆర్మీ స్మారక చిహ్నాలు ధ్వంసం

పోలాండ్‌: సోవియట్‌ కాలంనాటి రెడ్‌ ఆర్మీ స్మారక చిహ్నాలను పోలాండ్‌ అధికారులు ధ్వంసం చేశారు. చారిత్రక జ్ఞాపకాల్ని తుడిచివేయడం ద్వారా పోలాండ్‌ అవమానకరమైనరీతిలో నాలుగు రెడ్‌ ఆర్మీ స్మారక చిహ్నాలను తొలగించింది. రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీలకు వ్యతిరేకంగా పోరాడిన వీరోచిత రెడ్‌ఆర్మీ సాహసానికి అంకితం చేసిన స్మారక చిహ్నాలను పోలాండ్‌ ప్రభుత్వం కూల్చి వేసింది. పోలాండ్‌ 1945ల నాటి గ్లుబ్జిస్‌, బైజినా, బోబోలిస్‌, స్టాస్జో పట్టణాలలో ఉన్న నాలుగు స్మారక చిహ్నాలను ఊడబెరికింది.. వీటి కూల్చివేతకు దేశ చారిత్రక సంస్థ అధిపతి కరోల్‌ నవ్రోకి పిలుపునిచ్చారు. 1989లో పోలాండ్‌లో కమ్యూనిస్టు పాలనను నిర్మూలించినప్పటినుంచి మాస్కో ఆధిపత్య చిహ్నాలను బహిరంగ ప్రదేశాల నుండి తొలగించడానికి చర్యలు తీసుకుంటూనే ఉంది. దీనిలో భాగంగా దేశంలో వివిధ ప్రాంతాల్లోని స్మారక చిహ్నాలను, ఫలకాలను తొలగించింది. చారిత్రక వాస్తవాలను అవమానకరమైన రీతిలో చిత్రీకరించి దేశంలో కమ్యూనిజం వ్యతిరేకతను ప్రోత్సహించడానికి పోలాండ్‌లో తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్ని నెలల క్రితం, లాట్వియా, ఎస్టోనియా, ఉక్రెయిన్‌లో సోవియట్‌ కాలం నాటి స్మారక చిహ్నాలను తొలగించారు. పోలాండ్‌, బాల్టిక్‌ దేశాలలో, కమ్యూనిస్ట్‌ పార్టీల చిహ్నాలను (కొడవలి,సుత్తి) నిషేధించారు. ఇది వారి నియంతృత్వ విధానాలకు తార్కాణం. చరిత్రకు వ్యతిరేకంగా జరిగిన అవమానానికి, పెట్టుబడిదారీ దేశాల అధికారులే ప్రజలకు జవాబుదారీ. రాజకీయంగా, సైనికంగా, ఆర్థికంగా రష్యాపై ఉక్రెయిన్‌ పోరాటానికి పోలాండ్‌ మద్దతునిస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img