Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

రేపటి నుంచి రష్యా`చైనా నౌకాదళ విన్యాసాలు

మాస్కో: రష్యా, చైనాలు డిసెంబర్‌ 21-27 మధ్య సంయుక్త నౌకాదళ విన్యాసాలను నిర్వహిం చనున్నట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ సోమ వారం వెల్లడిరచింది. తూర్పు చైనా సముద్రంలో 2012 నుంచి ఏటా జరుగుతున్న ఈ ఉమ్మడి నౌకాదళ యుద్ధ విన్యాసాలలో క్షిపణులు, ఫిరంగి కాల్పులు ఉంటాయని పేర్కొంది. ‘రష్యా, చైనాల మధ్య నౌకాదళ సహకారాన్ని బలోపేతం చేయడం, ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని కొనసాగించడం ఈ విన్యాసాల ముఖ్య ఉద్దేశం’అని రష్యా రక్షణ మంత్రిత్వశాఖ పేర్కొంది. ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసినప్పటి నుంచి చైనాతో దాని రాజకీయ, భద్రత, ఆర్థిక సంబంధాలను పెంచుకోవ డానికి ప్రయత్నించింది. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ను పశ్చిమ వ్యతిరేక కూటమిలో కీలక మిత్రుడిగా పరిగణిస్తోంది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో అతి పెద్ద భూతల దండయాత్రను రష్యా ప్రారంభించడానికి కొద్ది రోజుల ముందు రెండు దేశాలు పరిమితులు లేని వ్యూహాత్మక భాగస్వామ్యంపై సంతకం చేశాయి. అయితే ఉక్రెయిన్‌లో రష్యా చర్యలపై బీజింగ్‌ ఆందోళన వ్యక్తం చేసింది. వర్యాగ్‌ క్షిపణి క్రూయిజర్‌తో సహా తమ దేశానికి చెందిన నాలుగు నౌకలు, ఆరు చైనా ఓడలు, రెండు దేశాల నుంచి విమానాలు, హెలికాప్టర్‌లు విన్యాసాల్లో పాల్గొంటా యని రష్యా తెలిపింది. బుధవారం నుంచి వారం రోజుల పాటు జరిగే విన్యాసాల్లో పాల్గొనేం దుకు రష్యా నౌకలు ఫార్‌ఈస్టర్న్‌ పోర్ట్‌ఆఫ్‌వ్లాడివోస్టాక్‌ నుంచి సోమవారం బయలుదేరాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img