Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

లండన్‌లో ప్రజానిరసనలు

లండన్‌: దక్షిణ లండన్‌లో పోలీసులు కాల్చి చంపిన నిరాయుధ నల్లజాతి వ్యక్తి క్రిస్‌ కాబాకు న్యాయం చేయాలంటూ దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. జాతీయ కార్యాచరణ దినోత్సవంలో భాగంగా ‘జస్టీస్‌ ఫర్‌ క్రిస్‌ కాబా’ ప్రచారానికి పిలుపునిచ్చిన నేపధ్యంలో లండన్‌లోని స్కాట్లాండ్‌ యార్డ్‌ వెలుపల వందలాది మంది నిరసించారు. కిబా బంధువు జెఫెర్సన్‌ బోసెలా మాట్లాడుతూ ‘‘చివరి వరకు’’ న్యాయం కోసం పోరాడతానని పేర్కొన్నారు. కాబా మరణానికి కారణమైన అధికారిని సస్పెండ్‌ చేయకూడదని పోలీసుల నిర్ణయాన్ని మాజీ లేబర్‌ నాయకుడు జెరెమీ కార్బిన్‌ ఖండిరచారు. కాబా మరణంపై ఇండిపెండెంట్‌ ఆఫీస్‌ ఫర్‌ పోలీస్‌ కండక్ట్‌ విచారణను ప్రారంభించింది. ‘‘మేము దీని కోసం సంవత్సరాలు వేచి ఉండము మాకు వీలైనంత త్వరగా న్యాయం కావాలి అని నిరసనకారులు డిమాండ్‌ చేశారు. మరణానికి తలపై తుపాకీ గాయమేనని ప్రాథమికంగా నిర్ధారించారు. అక్టోబర్‌ 4న విచారణ ప్రారంభం కానుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img