Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

లండన్‌లో మోదీ వ్యతిరేక ప్రదర్శన

లండన్‌ : భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా లండన్‌లోని హై కమిషన్‌ ఎదుట ప్రవాస భారతీయులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ‘కిసాన్‌ మజ్దూర్‌ ఏక్తా’ అన్న ప్లకార్డులు ప్రదర్శించారు. ఆదివారం ఉదయం లండన్‌లోని హౌస్‌ ఆఫ్‌ పార్లమెంటుకు ఎదురుగా ఉన్న వెస్ట్‌ మినిస్టర్‌ వంతెనపై ‘రిజైన్‌ మోదీ’ అన్న బ్యానర్‌ను ప్రదర్శించారు. మోదీ హయాంలో మరణించినవారి జ్ఞాపకార్థం భారత హైకమిషన్‌ వెలుపల క్యాండిల్‌ లైట్‌ జాగరణ చేపట్టారు. భారతీయ అన్నదాతలకు మద్దతు ప్రకటించారు. 75వ స్వాతంత్య్రం నాటికి భారత్‌లో లౌకిక రాజ్యాంగం అస్తవ్యస్తంగా ఉందని అని దక్షిణ ఆసియా సంఘటిత నిర్వాహకుల్లో ఒకరు ముక్తి ఒక ప్రకటనలో తెలిపారు. దేశంలో మానవహక్కులు ఉల్లంఘిస్తున్నారనీ వేలాదిమంది సామాజిక కార్యకర్తలు కోవిడ్‌ సోకిన జైళ్లలో ప్రభుత్వ నిరంకుశ చర్యలవల్ల మగ్గుతున్నారని ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్షధోరణి కారణంగా అనేకమంది తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. రైతు వ్యతిరేక చట్టాలు, లౌకిక రాజ్యాంగం, కరోనా నియంత్రణలో లోపాలు, ప్రజాహక్కులకు తూట్లు పొడవడంపై ఏషియా సాలిడారిటీ గ్రూప్‌ సహా వివిధ సంస్థలు 10పాయింట్లతో ఒక ప్రకటన విడుదల చేశాయి. నెదర్లాండ్స్‌లోని ది లండన్‌స్టోరీ అనే ప్రవాస భారతీయుల నేతృత్వంలో ‘ఈయూ`ఇండియా పీపుల్స్‌’ రోడ్‌మ్యాప్‌ను విడుదల చేసింది. మానవహక్కుల ఉల్లంఘనలలో ప్రభుత్వాలు జవాబుదారీగాఉండటం ముఖ్యమని పేర్కొంది. చర్చలు కీలకంగాఉండాలని తెలిపింది. డిజిటల్‌ డెమోక్రసీ, మానవహక్కులు, వాతావరణమార్పులకు సంబంధించి నిర్దిష్ట కార్యాచరణ చర్యలను పేర్కొంది. మూడువ్యవసాయ చట్టాలను విమర్శించింది. భారత్‌లోని పేద రైతులను నిరుద్యోగం, భూమిలేని స్థితికి ప్రభుత్వం నెట్టివేస్తోందని పేర్కొంది. భారత ప్రజలకు సంఫీుభావంగా ఉన్న ప్రవాసీలు దేశంలో జరుగుతున్న అన్యాయం, నేరపూరిత నిర్లక్ష్యానికి బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img